జియో ట్రిపుల్ ప్లస్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జియో ట్రిపుల్ ప్లస్

ముంబై, మార్చి 26 (way2newstv.com)
రిలయన్స్ జియోతో టెలికం రంగంలో సంచలనాలు సృష్టించిన ముకేశ్ అంబానీ ఇప్పుడు టీవీ విభాగంలోనూ ఇదే ట్రెండ్ కొనసాగించాలని చూస్తున్నారు. రిలయన్స్ జియో గిగాఫైబర్ ఎఫ్‌టీటీహెచ్ సర్వీసులతో దూసుకెళ్లేందుకు సిద్ధమౌతున్నారు. ఇందుకోసం పక్కా ప్రణాళికలతో సన్నద్ధమౌతున్నారు. టెలికంటాల్క్ ప్రకారం.. రిలయన్స్ జియో త్రిముఖ వ్యూహంతో (ట్రిపుల్ ప్లే ప్లాన్) ముందుకెళ్లాలని చూస్తోంది. ఇంటర్నెట్, వాయిస్ కాల్స్, జియో టీవీ సబ్‌స్క్రిప్షన్ వంటి సేవలను ఒకే ప్లాన్ కింద అందించేందుకు రెడీ అవుతోంది. 


జియో ట్రిపుల్ ప్లస్

జియో గిగాఫైబర్ ట్రిపుల్ ప్లాన్.. 100 జీబీ హైస్పీడ్ డేటా (100 ఎంబీపీఎస్ స్పీడ్), అపరిమిత వాయిస్ కాల్స్, జియో యాప్స్ యాక్సెస్, జియో హోమ్ టీవీ సబ్‌స్క్రిప్షన్ వంటి సేవలు అందించే అవకాశముంది. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు ఉండొచ్చు. ప్రస్తుతం ఈ సేవలు కంపెనీ ఉద్యోగులకు అందుబాటులో ఉన్నట్లు సమాచారం. జియో ఫైబర్ వెబ్‌సైట్ ప్రకారం.. బేసిక్ ప్లాన్ రూ.500 నుంచి ప్రారంభమౌతోంది. ఇందులో యూజర్లు నెల రోజులు 300 జీబీ డేటా పొందొచ్చు. డేటా స్పీడ్ 50 ఎంబీపీఎస్. అదే రూ.999 ప్లాన్‌లో 30 రోజులు 300 జీబీ డేటా పొందొచ్చు. డేటా స్పీడ్ 100 ఎంబీపీఎస్. ఇక రూ.1,500 ప్లాన్‌లో 30 రోజులపాటు 900 జీబీ డేటా పొందొచ్చు. డేటా స్పీడ్ 150 ఎంబీపీఎస్. తన ఎఫ్‌టీటీహెచ్ సర్వీసులను ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో పరీక్షిస్తోంది. త్వరలోనే ఈ సేవలను దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానుంది.