బ్రా...అండర్ వేర్ లలో బంగారం బిస్కెట్లు...
చెన్నై, మార్చి 29, (way2newstv.com)
బంగారం అక్రమ రవాణాకు స్మగ్లర్లు రూటు మార్చారు. అతి తెలివితో కొత్త, కొత్త మార్గాల్లో కస్టమ్స్, ఎయిర్‌పోర్ట్ అధికారుల కళ్లుగప్పాలని చూస్తున్నారు. చివరికి కథ అడ్డం తిరిగి దొరికిపోతున్నారు. తాజాగా చెన్నైలోనూ అదే జరిగింది. దొంగ బంగారాన్ని ఎయిర్ పోర్ట్ దాటించేందుకు బ్రాలో దాచి ఓ మహిళా ప్రయాణికురాలు.. కస్టమ్స్ అధికారులకు అడ్డంగా బుక్కైపోయింది. థాయ్‌కు క్రైసోర్న్ థాంప్రకోప్ అనే మహిళ బ్రాలో బంగారం బిస్కెట్లు పెట్టుకొని చెన్నై ఎయిర్‌పోర్టులో దిగింది.
కీలేడీలు...
ఆమె బయటకు వస్తుండగా తనిఖీలు చేయగా.. బ్రాలో బంగారం ఉన్నట్లు గుర్తించారు. 1.4 కిలోల బరువున్న రెండు బంగారపు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. మహిళను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. గోల్డ్ స్మగ్లింగ్ మాఫియా గుట్టును బయటపెట్టింది. చంఢీఘర్‌కు చెందిన కశ్యప్ అనే వ్యక్తి బంగారు బిస్కెట్లను చెన్నైకు చేర్చమన్నాడని కస్టమ్స్ అధికారులకు తెలిపింది. వాట్సాప్ ఫోటో ద్వారా బంగారు ఇవ్వాల్సిన వ్యక్తిని గుర్తించేలా ఒప్పందం కుదిరిందట. తర్వాత థాంప్రకోప్ సాయంతో కశ్యప్‌ను కూడా పట్టుకున్నారు. మరోవైపు పద్మావతి అనే మరో ప్రయాణికురాలి దగ్గర 365 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఆమె కువైట్ నుంచి అండర్ వేర్ లోపల దాచుకొని తరలిస్తుండగా పట్టుకున్నారు.