భద్రాద్రి కొత్తగూడెం,మార్చి 18 (way2newstv.com)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రాణంగా ప్రేమించిన ప్రియుడే యువతి పాలిట కాలయమడై ఆమెను అగ్నికి ఆహుతి చేశాడు. అనంతరం తాను కూడా అదే మంటల్లో కాలి బూడిదయ్యాడు. ఈ సంఘటన చుంచుపల్లి మండలంలో చోటుచేసుకుంది. చుంచుపల్లి మండలం రామాంజనేయ కాలనీలో వినోద్ , తేజస్విని అనే ఇద్దరు ప్రేమికులు ఓ ఇళ్లు అద్దెకు తీసుకుని గత కొద్దికాలంగా సహాజీవనం చేస్తున్నారు.
అగ్నికి ఆహుతయిన ప్రేమికులు
ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు చోటుచేసుకుంటున్నాయి.ఈ క్రమంలో సోమవారం ఉదయం చిన్న విషయంపై ఆగ్రహించిన వినోద్, తేజస్వినిని కిరోసిన్ పోసి తగులబెట్టాడు. తాను కూడా తగులబెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విషయం తెలిసి మృతుల కుటుంబసభ్యుల సైతం అక్కడికి చేరుకున్నారు.