హైదరాబాద్, మార్చి 11, (way2newstv.com )
గ్యాంగ్ స్టర్ నయీం బీనామి భూముల కేసుల్లో ఐదుగురిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేసారు. నయిమ్ బినామీ ఆస్తులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసేందుకు నిందితులు ప్రయత్నించారని వారాన్నిరు. సోమవాంర రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ మీడియాతో మాట్లాడారు. తుమ్మ శ్రీనివాస్ తో పాటు ఐదుగురు పాశం శ్రీను, అబ్దుల్ ఫహి, అబ్దుల్ నజీర్, హసీనా బేగం లను ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.88 లక్షల నగదు, మూడు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. భువనగిరి టౌన్ డివిఆర్ ఎస్టేట్ లోని ఐదే ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసేందుకు తుమ్మ శ్రీనివాస్ ప్రయత్నం చేశారు.
ఐదుగురు నయీం గ్యాంగ్ మెంబర్లు ఆరెస్టు
నయీం కేసులో ఎవ్వరిని వదిలిపెట్టేది లేదని అయన అన్నారు. నయీమ్ గ్యాంగ్ ఆగడాల వల్ల చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ కి సహకరించిన పోలీసుల పై చర్యలు తీసుకున్నాము. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కి నోటీసులు ఇచ్చినా కనీస పాత్రలు లేకుండా రిజిస్ట్రేషన్ జరుగుతుంది. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పై కూడా చర్యలు ఉంటాయని అన్నారు. నయీం అనుచరులు బెయిల్ పై జైల్ నుంచి బయటకు వచ్చిన తరువాత అక్రమాలకు పాల్పడుతున్నారు.. పాశం శ్రీను నయిమ్ భార్యతో కలిసి అక్రమ భూముల రిజిస్ట్రేషన్ కి ప్లాన్ చేశారు. తుమ్మ శ్రీనివాస్ ల్యాండ్ అమ్మడానికి ప్లాన్ వేసాడు. డీల్ లో భాగంగా 3లక్షలు బయనా పాశం శ్రీనివాస్ తీసుకున్నాడు. తరువాత వచ్చిన 89 లక్షలను నయీమ్ గ్యాంగ్ పంచుకుందని అయన అన్నారు..