ఆర్ధిక సర్వే... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆర్ధిక సర్వే...

8కోట్ల ఉద్యోగాలకు దారి  
న్యూఢిల్లీ, జనవరి 31 (way2newstv.com)
భారతదేశ ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రాన్ని ప్రతిబింబించే కీలకమైన ఆర్థిక సర్వే 2020ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఇందులో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి.
ఎకనమిక్ సర్వే 2020 హైలైట్స్
✺ ప్రపంచ ఎగుమతుల్లో భారత్ తన వాటాను బాగా మెరుగుపరుచుకుంటే 2025 కల్లా 4 కోట్ల ఉద్యోగాలు, 2030 నాటికి 8 కోట్ల ఉద్యోగాలు అందుబాటులోకి రావొచ్చు. ఉద్యోగాల కల్పనకు చైనా అనుసరిస్తున్న విధానాలను ఇండియా ఫాలో అవ్వాలి.
✺ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలపై ఒత్తిడి, కుటుంబాలు ఖర్చు చేయడం తగ్గిపోవడం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు మందగించడం, పన్ను వసూళ్లు తగ్గడం అనేవి ఇప్పుడు భారత్ ముందున్న ప్రధాన సవాళ్లు.
ఆర్ధిక సర్వే...

✺ 5 ట్రిలియన్ డాలర్ ఎకానమీ అంత ఈజీ కాదు. దీనికి ప్రో-బిజినెస్ పాలసీ ప్రమోషన్ కచ్చితంగా ఉండాలి.
✺ ప్రభుత్వ రంగ కంపెనీల్లో కేంద్రానికి ఉన్న వాటాలను ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేసి దానికి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఆయా కంపెనీల్లో ప్రభుత్వ వాటా విక్రయాల విషయాన్ని ఈ సంస్థనే చూసుకుంటుంది.
✺ ప్రపంచ బ్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో గణనీయమైన మెరుగుదల సాధించాం. భారత్ ర్యాంక్ 79 స్థానాలు మెరుగుపడింది. 2014లో 142వ స్థానం నుంచి 2019లో 63వ స్థానానికి చేరుకున్నాం.
✺ 2020 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 6-6.5 శాతంగా ఉండొచ్చు.
✺ ప్రతి సంవత్సరం అధిక పన్ను ఆదాయ వృద్ధి సాధ్యం కాదు.
✺ ఇన్వెస్ట్‌మెంట్లకు మూలధనం తగ్గింపు వల్ల దేశ ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం పడొచ్చు.
✺ ఆర్థిక వృద్ధిని కోరుకుంటే.. కచ్చితంగా ద్రవ్య లోటు లక్ష్యాన్ని సడలించుకోవాల్సిందే. ద్రవ్య లోటు లక్ష్యానికి కట్టుబడి ఉండటమా? లేదా ఆర్థిక వృద్ధా? రెండింటిలో ఏదో ఒకటే సాధ్యమౌతుంది.
✺ 2019-2020 ఆర్థిక వ్యవస్థ పన్ను వసూళ్లు అంచనా వేసిన దాని కన్నా తగ్గొచ్చు.
✺ ఇళ్ల ధరలు పెరిగాయి. దీని వల్ల బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల బ్యాలెన్స్‌షీట్లు ప్రక్షాళన అవుతాయి.
✺ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ వృద్ధి 2.5 శాతంగా అంచనా వేశారు.
✺ 2011-12 నుంచి 2017-18 మధ్య కాలంలో దేశంలో 2.62 కోట్ల కొత్త ఉద్యోగాల కల్పన జరిగింది.
✺ వ్యవసాయ రంగం వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే వచ్చే ఆర్థిక సంవత్సరంలో తగ్గొచ్చు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 2.8 శాతంగా ఉండొచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 2.9 శాతంగా నమోదు కావొచ్చు.
✺ 2014 నుంచి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యోల్బణం 4.1 శాతంగా ఉండొచ్చు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది ఎక్కువ.
✺ చైనా తర్వాత భారత్ రెండో అతిపెద్ద ఎమర్జింగ్ గ్రీన్ బాండ్ మార్కెట్‌గా అవతరించింది.
✺ 2018-19 ఆర్థిక సంవత్సరంలో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన -గ్రామీణ్ పథకం కింద 47.33 లక్షల ఇళ్ల నిర్మాణం జరిగింది.
✺ స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద 2014 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో 10 కోట్లకు పైగా టాయిలెట్లను నిర్మించారు.
✺ 2018లో ఏకంగా 1,24,000 కంపెనీల ఏర్పాటు జరిగింది. ఈ విషయంలో ప్రపంచంలో భారత్ 3వ స్థానంలో నిలిచింది.
✺ దేశంలో ఒక హోటల్‌ను ప్రారంభించడం కన్నా ఒక తుపాకీ లైసెన్సు సంపాదించడం సులువని సర్వే పేర్కొంది. ఢిల్లీలో పిస్తోల్‌ కలిగి ఉండేందుకు కావాల్సిన పత్రాల కన్నా హోటెల్‌ తెరవాలంటే ఎక్కువ డాక్యుమెంట్లు అవసరమని తెలిపింది