ఎండుతున్న మంజీరా.. (మెదక్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఎండుతున్న మంజీరా.. (మెదక్)

మెదక్, మార్చి 25(way2newstv.com): 
మంజీరా నది మళ్లీ మూడేళ్లుగా వెలవెల బోతుంది. అప్పటి వరకు నీటి సుడులతో వరద ముంచెత్తిన నది నేడు ఎండుముఖం చూపుతోంది. నదిలో నెర్రెలు వస్తున్నాయి. ఇసుక తేలుతుంది. దీంతో అక్రమార్కులకు ఇది వరమైంది. నదిపై ఆధారపడిన నీటి పథకాలు నిరసించి మూతపడుతున్నాయి. నిండుకుండలాగా ఉన్న నదిమా తల్లి ప్రస్తుతం ఏడారిగా మారడానికి కారణమైంది.మంజీరా నది మహారాష్ట్రంలో పుట్టి కర్ణాటక మీదుగా సంగారెడ్డి జిల్లా నాగల్‌గిద్ద మండలం గౌడ్‌గామ్‌జనవాడ వద్ద తెలంగాణలో అడుగుపెట్టింది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 96 కిలోమీటర్‌ మేర ప్రవహిస్తే ఉమ్మడి మనూరు మండలంలో 46 కిలోమీటర్లు పారుతుంది. నాగల్‌గిద్ద మండలం గౌడ్‌గామ్‌జనవాడలో ఆరంభమై మెదక్‌ మండలంలో ముగుస్తుంది. 


ఎండుతున్న మంజీరా.. (మెదక్)

అక్కడి నుంచి నిజామాబాద్‌ జిల్లా నిజాంసాగర్‌లో కలుస్తుంది. తరువాత నేరుగా గోదావరిలో చేరి సముద్రంలో విలీనమవుతుంది. అయితే ఈ నదిపై తాగు, సాగు కోసం కొన్ని దశాబ్దాల నుంచి ప్రభుత్వాలు కొన్ని వందల కోట్ల రూపాయలతో పథకాలు నిర్మించాయి. వేయిల ఎకరాల బీడు భూములను తడుస్తూ, ప్రజలకు తాగునీటిని అందించిన మంజీరా ప్రస్తుతం గుండెలు పగిలి రోదిస్తోంది. వేసవి తాపం ప్రారంభంలోనే ఇలా కావడమేంటని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నది ఎండటంతో భూ గర్భంలో నీటి మట్టం పడిపోయింది. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ప్రారంభమైంది. భగీరథ నీరు సరిపోక ప్రజలు అవస్థలు పడుతున్నారు.
మంజీరా నది 1972లో ఏర్పడిన తీవ్ర కరవు సమయంలో ఎండింది. అప్పటి నుంచి 2016 వరకు ఎన్నడూ ఎండలేదు. 2016 నుంచి వరుసగా ఎండుముఖం చూపుతుంది. ప్రభుత్వాలు ప్రత్యామ్యాయం చూపడం లేదేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇలా నది ఏడారి మారడమేంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నదిని నమ్ముకుని వ్యవసాయ భూముల్లో రూ. వేలల్లో పెట్టుబడి పెట్టిన రైతన్నలు కన్నీళ్లు కారుస్తున్నారు. పంటను కాపాడుకోవడానికి నదిలో బావులు తవ్వి అదనంగా నష్టపోతున్నారు. రైతన్నల కోసమైనా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.