తిరుమల, మార్చి 23, (way2newstv.com)
వికారినామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకుని తిరుమలలో ఏప్రిల్ 6న ఉగాది ఆస్థానాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనున్నారు. ఉగాది రోజు ఉదయం 3.00 గంటలకు సుప్రభాతసేవ అనంతరం శుద్థి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనంతరం తోమాలసేవ నిర్వహించి బంగారు వాకిలి చెంత పంచాంగ శ్రవణ కార్యక్రమం జరుగనుంది. ఉదయం 6.00 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామికి, విష్వక్సేనులకి విశేష సమర్పణను నిర్వహిస్తారు. ఉదయం 7.00 నుంచి 9.00 గంటల మధ్య విమాన ప్రాకారం, ధ్వజస్థంభం చుట్టు ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. అనంతరం శ్రీవారి మూలవిరాట్టు, ఉత్సవ మూర్తులకు నూతన వస్త్రాలను ధరింపజేస్తారు. ఇది పూర్తియిన తర్వాత పంచాగ శ్రవణం నిర్వహించనున్నారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలిలో ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.
ఏప్రిల్ ఆరునే ఉగాది ఆస్థానం
ఉగాది పురష్కరించుకొని ఏప్రిల్ 6న శ్రీవారి ఆలయంలో అర్జితసేవలను టీటీడీ రద్దు చేసింది. ఏప్రిల్ 2న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అత్యంత వైభవంగా టిటిడి నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు. సాధారణంగా ఏడాదికి నాలుగుసార్లు ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మూత్సోవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఉదయం 6.00 గంటలకు ప్రారంభమయ్యే తిరుమంజనం సుమారు 5 గంటలపాటు కొనసాగతుంది. ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలంతో శుద్ధి కార్యక్రమాన్ని ఆలయ సిబ్బంది ఒక మహాయజ్ఞంలా నిర్వహిస్తారు. తిరుమంజనం కారణంగా మంగళవారంనాడు నిర్వహించే అష్టదళపాదపద్మారాధన సేవను కూడా రద్దు చేశారు. తిరుమంజనం అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి మధ్యాహ్నం 12.00 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్నమరగదవల్లీ సమేత అగస్తీశ్వర ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 9 నుంచి జరగున్నాయి. నాగలాపురంలోని శ్రీ వేదవల్లి సమేత వేదనారాయణ స్వామి ఆలయంలో ఏప్రిల్ 8న మత్స్య జయంతి ఘనంగా నిర్వహించనున్నారు