టి.ఎస్‌.ఆర్టీసీకి వరించిన నాలుగు ప్రతిష్టాత్మక అవార్డులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

టి.ఎస్‌.ఆర్టీసీకి వరించిన నాలుగు ప్రతిష్టాత్మక అవార్డులు

హైదరాబద్  మార్చ్ 26  (way2newstv.com)                           
కార్మికులు, సిబ్బంది, అధికారుల కృషితో ఏదైనా సాధించవచ్చని, అందుకు ఉదాహరణ ప్రతిష్టాత్మక అవార్డుల ఫలితమని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వి.సి అండ్‌ ఎం.డి శ్రీ సునీల్‌ శర్మ, ఐ.ఎ.ఎస్‌ వ్యాఖ్యానించారు. అసోసియేషన్‌ ఆఫ్‌ స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండర్‌ టేకింగ్స్‌ (ఎ.ఎస్‌.ఆర్‌.టి.యు) ప్రతిఏట ప్రామాణికంగా ఎంపిక చేసే ప్రతిష్టాత్మక అవార్డులో భాగంగా 2017-18లో వాహన ఉత్పాదకత, ఇంధన పొదుపు విభాగంలో టి.ఎస్‌.ఆర్‌.టి.సికి మొత్తం నాలుగు అవార్డులు వరించాయి. పై కేటగిరీలో మూడింట ప్రథమ స్థానం, మరో కేటగిరీలో ద్వితీయ స్థానంలో   నిలిచి సంస్థ తన రాకార్డుల ఖాతాను పదిలపరుకుంది. దీంతో జాతీయ స్థాయిలో టి.ఎస్‌.ఆర్‌.టి.సి మరింత ఖ్యాతిని చాటుకుంది. మంగళవారం న్యూఢిల్లీలో లోధి రోడ్‌, హబిటాట్‌ సెంటర్‌, గుల్‌మోహర్‌లో జరిగిన ఎ.ఎస్‌.ఆర్‌.టి.యు 63వ వార్షిక సదస్సులో అవార్డులను ప్రధానం చేశారు. 


టి.ఎస్‌.ఆర్టీసీకి వరించిన నాలుగు ప్రతిష్టాత్మక అవార్డులు  

ఎ.ఎస్‌.ఆర్‌.టి.యు అధ్య‌క్షులు, మోర్త్‌ కార్యదర్శి సంజీవ్ రాజ‌న్, ఐ.ఎ.ఎస్‌ చేతుల మీదుగా సంస్థ వి.సి అండ్‌ ఎం.డి, టి.ఆర్‌.అండ్‌ బి ముఖ్య కార్యదర్శి సునీల్‌ శర్మ, ఐ.ఎ.ఎస్‌తో పాటు ఇ.డి (రెవెన్యూ, ఐటి), సంస్థ కార్యదర్శి పురుషోత్తం నాయక్‌, ఇ.డి (ఇ, ఒ, ఎ అండ్ ఎం) ఎం.ర‌వింద‌ర్‌, సి.ఎం.ఇ వెంకటేశ్వర్లు, సి.టి.ఎం పి.వి.మునిశేఖర్‌లు ఈ అవార్డులను స్వీకరించారు. వాహన ఉత్ఫాదకత కేటగిరీలో వాహనం ఒక రోజు తిరగిన కిలోమీటర్లు  హౖాెదరాబాద్‌ పట్టణంలో 228.98 నుంచి 238.90 వరకు  మెరుగుదలతో ప్రథమ స్థానంలో, గ్రామీణ ప్రాంతంలో 396.91 నుంచి 404.43 వరకు గానూ ద్వితీయ స్థానంలో నిలవగా, ఇంధన పొదుపులో హైదరాబాద్‌ నగరంలో 3000 వాహనాల కేటగిరీలో 4.45 కె.ఎం.పి.ఎల్‌ సాధించినందుకు గానూ, గ్రామీణ ప్రాంతంలో 4001 నుంచి 7500 వాహనాల కేటగిరీలో 5.48 కె.ఎం.పి.ఎస్‌తో ప్రథమ స్థానంలో నిలిచి మరింత గుర్తింపును చాటుకోవడంతో ఎం.డి సునీల్‌ శర్మ, ఐ.ఎ.ఎస్‌, ఇ.డి పురుషోత్తం నాయక్‌లు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎం.డి మాట్లాడుతూ, హైదరాబాద్‌ సిటిలో 2017-18 సంవత్సరానికి గానూ పట్టణ కేటగిరీలో రెండు అవార్డులు సాధించడంలో అప్పటి ఇ.డి (జి.హెచ్‌.జడ్‌) పురుషోత్తం నాయక్‌ కృషి  అభినందనీయమంటూ  ఆయనకు శుభాభినందనలు తెలియజేశారు.  డ్రైవర్‌, కండక్టర్స్‌, మెకానిక్స్‌, శ్రామిక్స్‌, సూపర్‌వైజర్ల నుంచి అధికారుల వరకు సమిష్టి కృషితోనే టి.ఎస్‌.ఆర్‌.టి.సి మరింత ప్రగతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఎ.ఎస్‌.ఆర్‌.టి.యు ఉపాధ్యక్షులు శివయోగ కాలసాద్‌,ఐ.ఎ.ఎస్‌,  ఎ.ఎస్‌.ఆర్‌.టి.యు ఇ.డి క్యాప్టెన్‌ వి.వి.రత్న పరికర్‌, సి.ఐ.ఆర్‌.టి డైరెక్టర్‌ క్యాప్టెన్‌ ఆర్‌.బి.శమీర్‌ పాటిల్‌, తదితరులు పాల్గొన్నారు.