తనని ఎందుకు ఆడనివ్వలేదో బీసీసీఐయే సమాధానం చెప్పాలి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తనని ఎందుకు ఆడనివ్వలేదో బీసీసీఐయే సమాధానం చెప్పాలి

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ డిమాండ్
జైపూర్‌ మార్చ్ 23 (way2newstv.com
ఐపీఎల్‌ లో గతేడాది తనని ఎందుకు ఆడనివ్వలేదో బీసీసీఐయే  సమాధానం చెప్పాలని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాడు స్టీవ్‌స్మిత్‌ డిమాండ్ చేసారు.. 2018 మార్చిలో దక్షిణాఫ్రికా సిరీస్‌లో బాల్‌టాంపరింగ్‌కు పాల్పడిన ఆసీస్‌ ఆటగాళ్లు స్టీవ్‌స్మిత్‌, డేవిడ్‌వార్నర్‌లపై ఐసీసీ ఏడాది పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ కూడా స్వచ్ఛందంగా వీరిని నిషేధించడంతో గత సీజన్‌లో వీరు ఐపీఎల్‌ మ్యాచులు ఆడలేదు. శుక్రవారం రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున జెర్సీ లాంచ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న స్మిత్‌  పై వ్యాఖ్యలు చేశాడు. 


తనని ఎందుకు ఆడనివ్వలేదో బీసీసీఐయే  సమాధానం చెప్పాలి

మార్చి 29న అంతర్జాతీయ మ్యాచుల నిషేధం పూర్తవుతున్న సందర్భంగా ఈసారి ఐపీఎల్‌లో పాల్గొనేందుకు స్మిత్‌ తిరిగి రాజస్థాన్‌ జట్టులో చేరాడు. భుజం గాయం నుంచి కోలుకుంటే.. ఈనెల 25న కింగ్స్‌ XI పంజాబ్‌తో జరిగే మొదటి మ్యాచ్‌లో ఆడనున్నాడు.రాజస్థాన్‌ రాయల్స్‌ స్పాన్సర్‌ లక్ష్మి సిమెంట్స్‌ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న స్మిత్‌ మీడియాతో మాట్లాడాడు. ఇకపై తాను అన్ని మ్యాచులు ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని, గతడాది ఐపీఎల్‌లో తననెందుకు నిషేధించారో బీసీసీఐ మాత్రమే సమాధానం చెప్పాలన్నాడు . తిరిగి ఐపీఎల్‌ జట్టులో చేరడం తనకెంతో సంతోషంగా ఉందని, ఈ సీజన్‌లో బరిలో దిగేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పాడు.