చంద్రబాబు ఆస్తి రూ. 20 కోట్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

చంద్రబాబు ఆస్తి రూ. 20 కోట్లు

అప్పులు రూ.5కోట్లు
భార్య భువనేశ్వరి ఆస్తులు రూ.648 కోట్లు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఆస్తి మొత్తం రూ.20 కోట్లు.నామినేషన్‌ దాఖలు  చేసిన సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తులు, కేసుల వివరాలివి.
చంద్రబాబు పేరిట ఉన్న ఆస్తులు
* మొత్తం ఆస్తులు: రూ.20,44,33,814
* చరాస్తులు: రూ.47,38,067
* స్థిరాస్తులు: రూ.19,96,95,474
* అప్పులు: రూ.5,24,96,605 (ఇందులో లోకేష్‌ కోసం రూ.8,89,088)
* 2017-18లో ఆదాయపన్ను శాఖకు చూపించిన ఆదాయం: రూ.64,73,208
* మోటారువాహనం: అంబాసిడర్‌ కారు (ఏపీ09జీ 0393). దీని విలువ రూ.2,22,500
స్థిరాస్తి వివరాలు


చంద్రబాబు ఆస్తి రూ. 20 కోట్లు

* హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని రోడ్డునెంబరు 65లో 1225 చ.గజాల స్థలంలో 14,950 చ.అడుగుల విస్తీర్ణంలో భవనం. ఈ స్థలాన్ని 1985లో రూ.1,76,000తో కొన్నారు. ఆ తర్వాత దీనిపై రూ.7,99,59,988 పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం భవనం విలువ రూ.19,55,01,474.
* చిత్తూరు జిల్లా నారావారిపల్లె పంచాయతీ శేషాపురంలోని సర్వేనెంబరు 214/3లో 0.97 ఎకరాల్లో 3,950 చ.అడుగుల విస్తీర్ణంలో ఇల్లు. దీనికి రూ.23,84,462 వెచ్చించారు. ప్రస్తుతం దీని విలువ: రూ.41,94,000.
* సొంతంగా కొనుగోలు చేసిన ఆస్తుల విలువ: రూ.19,55,01,474.
* వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తుల విలువ: రూ.41,94,000.
అప్పుల వివరాలు
* బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో లోకేష్‌తో కలిసి (50 శాతం): రూ.5,16,07,517 అప్పు
* ఎన్‌.లోకేష్‌కు: రూ.8,89,088 రుణం.
కేసులు..
* పెండింగ్‌ కేసులు: 1 (ఎఫ్‌ఐఆర్‌ నెంబరు: 67/2010)
* కేసు వివరాలు: మహారాష్ట్రలోని బాబ్లీ డ్యాం సందర్శన సందర్భంగా ధర్మాబాద్‌ కోర్టు పరిధిలో నమోదైంది.
భువనేశ్వరి పేరుతో ఉన్న ఆస్తులు
* మొత్తం ఆస్తి: రూ.648,13,17,434
* స్థిరాస్తి మొత్తం: 74,29,00,000
* చరాస్తులు: రూ.573,84,17,434
* 2017-18లో భువనేశ్వరి పేరుతో చూపించిన ఆదాయం: రూ.13,45,30,513
* సొంతంగా సంపాదించిన ఆస్తి విలువ: రూ.74,29,00,000
చరాస్తి వివరాలు
* బంగారం: రూ.1,12,36,167 విలువ చేసే 3,519 గ్రాములు.
* రూ.89,44,500 విలువ చేసే 445 క్యారెట్ల విలువైన రాళ్లు ముత్యాలు
* రూ.17,43,051 విలువైన 42.41 కిలోల వెండి
* హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌లో ఉన్న షేర్లు 1,06,61,652. ఒక్కో షేరు విలువ రూ.511.90. ప్రస్తుతం వీటి మొత్తం విలువ రూ.545,76,99,659.
* నిర్వాణ హోర్డింగ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌లో పెట్టుబడులు: రూ.3,28,80,000
* మెగాబిడ్‌ ఫైనాన్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రైవేటు లిమిటెడ్‌లో పెట్టుబడి: రూ.22,49,900.
* స్థిరాస్తి మొత్తం: రూ.74,29,00,000
* వ్యవసాయ భూములు: రంగారెడ్డి జిల్లా మదీనాగూడలోని సర్వేనెంబరు 51లో 2004లో రూ.73,80,100తో ఐదెకరాల భూమి కొనుగోలు. ప్రస్తుతం దీని మార్కెట్‌ విలువ రూ.45,00,00,000
* వ్యవసాయేతర భూములు: తమిళనాడులోని కాంచీపురం జిల్లా సెన్నేరుకుప్పంలో 2.33 ఎకరాల్లో 50వేల చ.అడుగుల విస్తీర్ణంలో భవనం. దీన్ని 1996, 1999లో కొనుగోలు చేశారు. అప్పట్లో దీని విలువ రూ.8,66,162. ఆ తర్వాత భవనాన్ని అభివృద్ధి చేసేందుకు మరో రూ.1,77,66,854 వెచ్చించారు. ప్రస్తుతం దీని మార్కెట్‌ విలువ రూ.29,29,00,000.
అప్పులు...
* మొత్తం చెల్లించాల్సిన అప్పులు: రూ.10,07,98,182
* బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా(ఓవర్‌ డ్రాఫ్ట్‌)లో అప్పు: రూ.3,48,71,222
* ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌కు రెంటల్‌ అడ్వాన్స్‌ కింద: రూ.38,01,600
* ఎల్‌సీసీ నుంచి రెంటల్‌ అడ్వాన్స్‌: రూ.14,40,000
* ఎన్‌.లోకేష్‌ నుంచి: రూ.5,70,05,870
* రెడ్‌హిల్స్‌ లాజిస్టిక్స్‌ నుంచి: రూ.22,22,063
* ఇతరుల నుంచి తీసుకున్నది: రూ.14,57,419