నిజామాబాద్, మార్చి 14, (way2newstv.com)
పట్టభద్రుల సమస్యలపై నాకు పూర్తి అవగాహన ఉంది. ఎమ్మెల్సీ గా నన్ను గెలిపించండి అందరి సమస్యలను పరిష్కరిస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాణి రుద్రమ అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. పట్టభద్రుల సమస్యలపై ఎమ్మెల్సీ గా పోటీ చేసే అభ్యర్థులు నాతో చర్చకు రావాలి.. నాలుగు జిల్లాలో ఎక్కడ చర్చ పెట్టిన నేను చర్చ కు సిద్ధమని ఆమె అన్నారు.
అందరి సమస్యల పరిష్కారం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కారుల ఆకాంక్ష నెరవేరలేదు. ఉద్యోగుల కు సీపీస్ విధానం రద్దు చేసి పాత పెన్షను విధానం అమలుకు కృషి చేస్తానని అమె అన్నారు. పట్ట భద్రుల ఎం.ఎల్.సి. ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవు ఇచ్జినట్లు ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు సెలవు ఇవ్వాలని డిమాండ్ చేసారు. జర్నలిస్టుల సమస్యలపై శాసన మండలి లో పోరాటం చేస్తా. నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండని ఆమె కోరారు..