కడప, మార్చి 26 (way2newstv.com)
కేసీఆర్‌తో కలిస్తే తప్పేంటన్న జగన్.. టీఆర్ఎస్‌తో ఉన్న బంధాన్ని బయటపెట్టిందంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని జగన్ మరిచారేమో కానీ.. ప్రజలు మర్చిపోలేదన్నారు. ఆంధ్రా ద్రోహి జగన్‌కు ప్రజలు బుద్ధిచెప్పాలని.. ఇది ఎన్నికల యుద్దం, నమ్మకద్రోహులపై పోరాటంటా అభివర్ణించారు. జగన్ ఓ అరాచక శక్తి.. వైసీపీ ఒక అరాచక పార్టీ అని మండిపడ్డారు. మంగళవారం పార్టీ నేతలతో సమావేశమైన చంద్రబాబు ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కేసీఆర్ కేసులు ఎందుకేశారో చెప్పాలన్నారు చంద్రబాబు. ఆంధ్రులను అడుగడుగునా ఎందుకు అవమానిస్తున్నారని మండిపడ్డారు. వీటిపై కేసీఆర్‌ను నిలదీసే ధైర్యం జగన్‌కు ఉందా అంటూ ప్రశ్నించారు.
కేసీఆర్, జగన్ మధ్య సంబంధం బయిటపడింది
రాష్ట్ర విభజనపై అప్పుడు పోరాడాం.. తర్వాత ప్రజల్ని నమ్మించి మోసం చేసిన బీజేపీపై ధర్మపోరాటం చేశామన్నారు. ఇప్పుడు ఆంధ్రా ద్రోహులపై పోరాటం చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో ఉండే జగన్‌కు ఆంధ్రా వాళ్లనంటే బాధ ఎలా ఉంటుందన్నారు. జగన్, కేసీఆర్‌ల మధ్య బంధం బయటపడిందని.. దొంగలు దొరికిపోయారన్నారు. నడి బజారులో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని ఘాటుగా వ్యాఖ్యానించారు. దొంగ పార్టీలకు ప్రజలే గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. టీడీపీ సంక్షేమ పథకాలపై ప్రజల్లో ఆదరణ ఉందని.. అది భరించలేకే జగన్ దొంగనాటకాలు, కుతంత్రాలంటున్నారని మండిపడ్డారు. ఏపీ పడుతున్న కష్టాలకు కేసీఆరే కారణమన్నారు చంద్రబాబు. విభజన తర్వాత కేసీఆర్ ఏపీపై కక్షతో ఉన్నారని.. పోలవరం ప్రాజెక్టును, రాయలసీమకు నీరు ఇవ్వడాన్ని కేసీఆర్ వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. తెలుగు తమ్ముళ్లు కేసీఆర్‌తో కలిస్తే తప్పేంటన్న జగన్ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు. మోదీ వచ్చినప్పుడు చేసిన నిరసనల కంటే భారీగా జగన్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలని సూచించారు