మహబూబ్ నగర్ మార్చి 30 (way2newstv.com):
ఎంపీ జితేందర్ రెడ్డి పై తెరాస ఎమ్మెల్యేలు మండిపడ్డారు. జితేందర్ రెడ్డి మొన్నటివరకు సీఎం కేసీఆర్ గారితో కలిసి ఉండి ఇవ్వాళ విమర్శించడం తగదని వారన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ 31 ఆదివారం రోజు సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఉంటుంది. భూత్ పూర్ ,అమిస్తా పూర్ మధ్యలో సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం ఉంటుంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు వస్తాయి. మహబూబ్ నగర్ ఎంపీ గా ఉన్నప్పుడే తెలంగాణ వచ్చిందని అన్నారు. దేశం మన రాష్ట్రాన్ని చిన్న చూపు చూస్తుంది. 17 మంది ఎంపీ లతో పేరు దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల ఎంపీ లతో సత్సంబంధాలు ఉన్నాయి. 16 ఎంపీ లు అని చిన్నచూపు చూడొద్దని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కు జాతీయ హోదా వస్తుంది.
పదహారు సీట్లు మావే
ఈ జిల్లా కాంగ్రెస్, బిజెపి నాయకులు కేస్ లు వేసి అడ్డుకున్నారు.. కష్టపడి ఈ ప్రాంతం నుండి ప్రపంచ స్థాయికి ఎదిగిన వ్యక్తి మన్నే శ్రీనివాస్ రెడ్డి. ప్రపంచ దేశాల్లో పాలమూరు పేరు ఎమ్ ఎస్ ఎన్ ద్వారా వినబడుతుందని అన్నారు. పాలమూరు లో 9000 కోట్లు పెట్టి పెండింగ్ ప్రాజెక్ట్ లు పూర్తి చేసినం. 18000 వేల కోట్లు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కు కేటాయించినం. రో రెండు మూడు సార్లు టీ ఆర్ ఎస్ పార్టీని గెలిపించండని అయన కోరారు. అందరి కంటే ఎక్కువ దేశభక్తి సీఎం కేసీఆర్ గారికి ఉందని అన్నారు. ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ ఎల్లుండి జరిగే సీఎం కేసీఆర్ సభకు తరలి రావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు చాలా ప్రాధాన్యత ఉంది. దేశ రాజకీయాల్లో మార్పు తీసుకువచ్చే ఎన్నికలు. గతంలో గెలిచిన పార్టీలు దేశ అభివృద్ధి ని పట్టించుకోలేదు మన రాష్ట్రం,మన జిల్లా బాగుపడేందుకు ఈ ఎన్నికలు కీలకమని అన్నారు. దేశం గణనీయంగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్న ఇంకా వెనకబడి ఉన్నాం. దేశంలో నెంబర్ వన్ సీఎం కేసీఆర్. ముందుచూపు ఉన్న వ్యక్తి, సమర్ధవంతంగా పరిపాలించగల శక్తి సామర్ధ్యాలు ఉన్న వ్యక్తి సీఎం కెసిఆర్ అని అన్నారు. భారత దేశం అభివృద్ధి ముందుకు పోవాలి అంటే తెలంగాణ ప్రజలు వేసే ఓటు కీలకం కానుంది. 16 సీట్లు గెలిపించుకుంటామని అన్నారు.