పెద్దపల్లి మార్చి21 (way2newstv.com)
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వివరాలతో కూడిన పోస్టల్ బ్యాలేట్ వివరాలను ఆన్ లైన్లో నమోదు చేయాలని రాష్ట్ర అదనపు ముఖ్య ఎన్నికల అధికారి అమ్రపాలి సంబంధిత అధికారులను ఆదేశించారు. పోస్టల్ బ్యాలేట్, ఐటి అంశాల పై జిల్లా ఎన్నికల అధికారులతో ఆమె మంగళవారం దూరదృశ్య సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఎన్నీకల విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అందరికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలేట్ సౌకర్యం కల్పించాలని, ఫారం 12, 12 ఎ ద్వారా వారి వద్ద నుండి సమాచారం సేకరించి, వాటి వివరాలను నూతన వెబ్ సైట్లో నమోదు చేయాలని, అనంతరం ఈడిసిలో ఒటర్ ఐడి సంఖ్య మరియు ఉద్యోగి గుర్తింపు సంఖ్య ఎంట్రి చేస్తే ఉద్యోగుల పూర్తి వివరాలు వస్తాయని, ఎన్ఐసి డాటాబేస్ ఉపయోగించుకోవాలని ఆమె అధికారులకు సూచించారు.
పోస్టల్ బ్యాలెట్ల వివరాలను ఆన్ లైన్లో వెంటనే నమోదు చేయాలి
ఎన్నికల విధులు పాల్గోనే వారందరి వివరాలు పిబిసాప్ట్ లో నమోదు చేయాలని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ వివరాలు నమోదు చేయడానికి లాగిన్ ఐడి అందించడం జరుగుతుందని, సాప్టవేర్ లో ఎంట్రీ అయిన ప్రతి సారి రిజిస్టర్ ఫోన్ నెం. కు మెసేజ్ వస్తుందని, తద్వారా సమాచారం చాలా భద్రత ప్రమాణాలతో ఉంటుందని తెలిపారు. ఎన్నికల విధులలో పాల్గోంటున్న ప్రభుత్వ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, వీడియోగ్రాఫర్లు, ఫోటోగ్రాఫర్లు, డ్రైవర్లు, ఇతర సిబ్బంది అందరి వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. అనంతరం పిబిసాప్ట్ , ఈడిసి పై ఆమె అధికారులకు పూర్తి స్థాయిలో పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా వివరించి అధికారుల సందేహలను నివృత్తి చేసారు. పెద్దపల్లి ఆర్డివో్ ఉపెందర్ రెడ్డి, జిల్లా సహకార అధికారి చంద్రప్రకాశ్ రెడ్డి, జిల్లా హర్టకల్చర్ అధికారి జ్యోతి, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్ రావు, ఈడిఎం కవిత, సంబంధిత అధికారులు, తదితరులు ఈ దూరదృశ్య సమీక్షలో పాల్గోన్నారు.