సెంచరీ చేసిన విరాట్

నాగ్ పూర్, మార్చి 10 (న్యూస్ పల్స్) 
ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో భారత్ నిలకడగా ఆడుతోంది. రోహిత్ శర్మ డకౌట్గా వెనుదిరగడం.. ఆ తర్వాత శిఖర్ ధావన్(21), అంబటి రాయుడు(18) తక్కువ స్కోరుకే  వెనుదిరగడంతో భారత్ పై ఒత్తిడి పెరిగింది. ఈ దశలో క్రీజులో ఉన్న విరాట్ కోహ్లీ భారీ ఇన్నింగ్స్కు పునాది వేశాడు. ఆల్రౌండర్ విజయ్ శంకర్తో కలిసి భారత్ స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. ఈ క్రమంలోనే కోహ్లీ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. 


సెంచరీ చేసిన విరాట్

జంపా వేసిన 29వ ఓవర్లో రెండు ఫోర్లు బాది ఊపుమీదున్న కోహ్లీ ఐదో బంతిని సింగిల్ కోసం  ప్రయత్నించాడు. పరుగు కోసం ప్రయత్నించి నాన్ైస్ట్రెక్ ఎండ్లో ఉన్న విజయ్ రనౌటయ్యాడు. హాఫ్సెంచరీకి చేరువలో ఔటవడంతో శంకర్ నిరాశగా పెవిలియన్ చేరాడు. 31 ఓవర్లు ముగిసేసరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. విరాట్(66), కేదార్ జాదవ్ (6) క్రీజులో ఉన్నారు.
Previous Post Next Post