కేంద్రం తరహాలో 12 వరకు ఒకే సంస్థ
హైదరాబాద్ ఏప్రిల్ 24, (way2newstv.com)
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డుపై సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇంటర్ బోర్డును రద్ధు చేయాలని ఆదేశాలు జారీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తరహాలో ఒకటి నుంచి 12 వ తరగతి వరకు ఒకే బోర్డును ఏర్పాటు చేయనున్నారు. కేంద్రంలో సీబీఎస్ఈ బోర్డు 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యా విధానాన్ని పర్యవేక్షిస్తున్నది.
కేసీఆర్ సంచలన నిర్ణయం
తెలంగాణ ఇంటర్ బోర్డును పాఠశాల విద్యాశాఖలో విలీనం చేస్తారా లేదా పేరు మార్చి, 1 నుంచి 12 వ తరగతి వరకు మరో సంస్థను ఏర్పాటు చేస్తారా అనేది స్పష్టం కావాల్సి ఉన్నది. ఈ అంశంపై చర్చించేందుకు ఈరోజు ప్రగతి భవన్ సీఎం కేసీఆర్ విద్యశాఖ ఉన్నతాధికారులు, ఇంటర్ బోర్డు అధికారులతో సమావేశమయ్యారు. సమావేశం తరువాత సీఎం కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. గత మూడు రోజులుగా ఇంటర్ ఫలితాలపై రాష్ట్ర వ్యప్తంగా ఉద్యమాలు, విమర్శలు, ప్రతి విమర్శలతో అట్టుడుకుతోంది. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాయి. ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఖరిని దుమ్మెత్తపోస్తున్నాయి.