గ్రామీణ క్రీడాకారులకు ఉచితంగా దుస్తులు పంపిణీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గ్రామీణ క్రీడాకారులకు ఉచితంగా దుస్తులు పంపిణీ

విద్యతో పాటు క్రీడలపై దృష్టి సారించాలి 
ప్రిన్స్ స్వచ్చంద సేవ సమితి 
ఎమ్మిగనూరు, ఏప్రిల్ 27 (way2newstv.com
విద్యార్థులు చదువుతో పాటు మానసిక ఉల్లాసంగా ఉండేందుకు క్రీడలు,సాంస్కృతిక కార్యక్రమాలపై దృష్టి సారించాలని మాచాని సోమప్ప ఇంగ్లీష్ మీడియం ఎయిడెడ్ హైస్కూల్ ఏవో వైకుంఠ వాసు, ప్రిన్స్ సేవా సమితి అధ్యక్షుడు వహాబ్ లు అన్నారు. 


గ్రామీణ క్రీడాకారులకు ఉచితంగా దుస్తులు పంపిణీ

ఎమ్మిగనూరు పట్టణంలోని ప్రిన్స్ స్వచ్చంద సేవ సమితి ఆధ్వర్యంలో శనివారం స్థానిక జూనియర్ కళాశాల ఆవరణంలో గల ఇండోర్ స్టేడియంలో వేసవి సెలవుల దృష్ట్యా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన జిల్లాస్థాయిలో పదిహేను అండర్-14 ఫుట్ బాల్ క్రీడాకారులకు ఉచితంగా క్రీడా దుస్తులు పంపిణీచేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలోనే ప్రతిభ గల క్రీడాకారులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని తెలిపారు.వారిని వెలికి తీయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని అన్నారు.సెక్రెటరీ విశ్వనాథం రమేష్ మాట్లాడుతూ విద్యార్థులు  క్రీడ పోటీలకు మానసిక ఉల్లాసం,క్రమశిక్షణను అలవాటు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫుట్ బాల్ సెక్రటరీ రమేష్, పియిటీలు నరసింహారాజు,ఉప్పర వెంకటేశ్వర్లు,సర్తాజ్, రాజేష్,భరత్,మాబు,వీరేష్,రాము,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు