శ్రావణి హత్య కేసులో పోలిసుల నిర్లక్ష్యం..ఎస్‌ఐ పై వేటు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

శ్రావణి హత్య కేసులో పోలిసుల నిర్లక్ష్యం..ఎస్‌ఐ పై వేటు

యాదాద్రి భువనగిరి ఏప్రిల్ 27 (way2newstv.com
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విద్యార్థిని శ్రావణి హత్య కేసు విషయంలో యాదాద్రి-భువనగిరి జిల్లా బొమ్మలరామారం ఎస్‌ఐ వెంకటయ్యపై ప్రభుత్వం వేటు వేసింది. హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌చేస్తూ డీసీపీ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థిని శ్రావణి హత్య కేసులో నిర్లక్ష్యం వహించారని ఎస్‌ఐపై చర్యలు తీసుకున్నారు. ఇక పదోతరగతి స్పెషల్‌ క్లాసులకు వెళ్లిన విద్యార్థిని శ్రావణి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. దుండగులు ఆమె మృతదేహాన్ని ఓ పాడుబడ్డ బావిలో ఖననం చేయగా.. ఈ కేసు దర్యాప్తులో ఆలస్యంగా స్పందించిన పోలీసుల తీరుపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసు వాహనాలపై దాడికి దిగారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటన యాదాద్రి-భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో ఈ సంఘటన వెలుగుచూసింది. గురువారం అదృశ్యమైన శ్రావణి.. మరుసటి రోజు పాడుబడ్డబావిలో శవంగా కనిపించింది. ఎటువంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది.దీనితో శ్రావణి హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. 


శ్రావణి హత్య కేసులో పోలిసుల నిర్లక్ష్యం..ఎస్‌ఐ పై వేటు

మర్డర్ కేసు మిస్టరీని చేధించేందుకు నిందితులను పట్టుకునేందుకు ఐదు పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. టవర్ లొకేషన్ ఆధారంగా కాల్ డేటాలను విశ్లేషించే పనిలో పడ్డారు. మేడ్చల్‌ జిల్లా కీసరలోని సెరినిటీ ప్రైవేట్‌ స్కూల్‌లో తొమ్మిదో తరగతి పూర్తిచేసింది. వారం రోజులుగా పాఠశాలలో నిర్వహిస్తున్న పదోతరగతి ముందస్తు తరగతులకు హాజరవుతోంది. 15కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు ప్రతి రోజు ఆర్టీసీ బస్సులో వెళ్లి ఇంటికి చేరుకునేది. గురువారం ఆమె ఇంటికి చేరుకోలేదు. శుక్రవారం ఉదయం శ్రావణి తల్లిదండ్రులు పోలీసులకు పిర్యాదు చేశారు. అయితే ఆమె హత్యకు గురైందని తెలిసి గుండెలవిసేలా రోధిస్తున్నారు.గుర్తు తెలియని వ్యక్తులు శ్రావణిని హత్య చేశారు. ఓ పాడుపడ్డ బావి వద్ద ఆమె స్కూల్ బ్యాగ్‌ను గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వందగజాల దూరంలో మరో పాడుపడ్డ బావిలో మట్టిగుంట తవ్విన ఆనవాళ్లు గుర్తించారు. ఆ గుంట తవ్వగా శ్రావణి మృతదేహం కనిపించింది. నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఘటన స్థలానికి కొంత దూరంలో ఖాళీ మద్యంసీసాలను క్లూస్ టీమ్ సేకరించింది. అయితే సమాచారం ఇచ్చినా ఘటనాస్థలానికి ఆలస్యంగా పోలీసులు చేరుకోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నిందితులను పట్టుకునేవరకు మృత దేహాన్ని పోస్టుమార్టం జరగనివ్వమని డీసీపీ వాహనాన్ని ధ్వంసం చేశారు. దీంతో అర్ధరాత్రి వరకు తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగాయి. చివరికి బాధిత కుటుంబానికి పోలీసులు నచ్చజెప్పి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.శ్రావణి మృతదేహాన్ని భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ పరిశీలించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు పురోగతిపై పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని బాధిత కుటుంబాలకు కలెక్టర్ హామీ ఇచ్చారు.