రాజకీయ భీష్ములు ఇక దూరమేనా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రాజకీయ భీష్ములు ఇక దూరమేనా

విశాఖపట్టణం, ఏప్రిల్ 15, (way2newstv.com)
ఈసారి ఎన్నికల్లో చాలా చిత్రాలు కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్రలో చూసుకుంటే మూడు జిల్లాల్లో సీనియర్ సిటిజన్లు ఈసారి రంగంలో ఉన్నారు. వారికి ఓ విధంగా ఇవే ఆఖరు ఎన్నికలు అని చెప్పాలి. గెలిచినా ఓడినా కూడా వారు రాజకీయాల నుంచి దాదాపుగా తప్పుకునే అవకాశాలు ఉన్నాయి. మూడు జిల్లాల్లో చూసుకుంటే డజనుకు పైగా రాజకీయ భీష్ములు కనిపిస్తారు. అన్ని పార్టీల్లోనూ వీరు ఉండడం విశేషం.రాజకీయాల్లో విరమణ అంటూ జరగదు. ఓపిక ఉన్నంతవరకూ పనిచేయడమే. టికెట్ కోసం అర్రులు చాచడం. పదవుల కోసం పరుగులు తీయడం. ఈ జంజాటం చివరి వరకూ తప్పదు. అయితే ఇలాంటి వారు ప్రజలు కనుక తీర్పు చెబితే గమ్మున ఉంటారు. లేకపోయినా అధినాయకత్వాలు ఈ సాకు చూపించి పక్కకు పెట్టేస్తారు. విశాఖ జిల్లాలో సీనియర్ నేత, మంత్రిగా ఉన్న చింతకాయల అయ్యన్నపాత్రుడు చివరి సారి అంటూనే మళ్ళీ పోటీకి దిగారు. ఆయన గెలిస్తే వచ్చే సారికి డెబ్బయి ఏళ్ళకు చేరువ అవుతారు. 


రాజకీయ భీష్ములు ఇక దూరమేనా

ఓడినా ఇక రాజకీయాలకు సెలవు అంటారు. అలాగే టీడీపీకి చెందిన పెందుర్తి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి ఈసారి ఓడితే ఇక రాజకీయ సన్యాశమే అంటున్నారు. ఆయనది కూడా మూడు దశాబ్దాల చరిత్ర. సబ్బం హరి పరిస్థితి కూడా దాదాపుగా అంతే.ఇక ఉత్తరాంధ్రంలోనే విశిష్ట రాజకీయ కుటుంబం ద్రోణం రాజు సత్యనారాయణది. ఆయన వారసుడు గా శ్రీనివాస్ ఇప్పటికి అయిదు సార్లు పోటీ చేసి రెండు సార్లు గెలిచారు. ఈసారి వైసీపీ తరఫున పోటీలో ఉన్నారు. గెలిస్తే కొనసాగుతారు కానే ఓడితే మాత్రం రాజకీయ జీవితం సమాప్తమే అంటున్నారు. గంటా శ్రీనివాసరావు సీనియర్ మంత్రి. ఆయన తప్పకుండా గెలుస్తానని అంటున్నారు. పొరపాటున ఓడితే మాత్రం రాజకీయంగా తప్పుకోవడమేనని చెబుతున్నారు.ఇక విశాఖ రూరల్ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి పోటీ చేస్తున్న కన్నబాబురాజు. విజయనగరం జిల్లా నుంచి పోటీలో వున్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, టీడీపీ నుంచి లోక్ సభకు పోటీ పడుతున్న పూసపాటి అశోక్ గజపతిరాజు, అరకు ఎంపీ సీటుకు పోటీ పడుతున్న కిషోర్ చంద్రదేవ్, నెల్లిమర్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీలో ఉన్న పతివాడ నారాయణస్వామి వంటి వారు రాజకీయంగా ఇక గెలిచినా ఓడినా ఇదే చివరి అవకాశం అని అంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో మాజె ఎమంత్రి ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, కిమిడి కళా వెంకట రావు వంటి వారు గెలిచినా ఓడినా ఇవే చివరి ఎన్నికలు అని అంటున్నారు. వీరంతా రాజకీయంగా కొన్ని దశాబ్దాలుగా కీలకమైన పాత్ర పోషిస్తూ వచ్చారు. ఈసారి ఎన్నికలు వీరికి చాలా ముఖ్యమైనవి. గెలుపే ఊపిరి గా ముందుకు సాగాలనుకుంటున్నారు మరి.