సత్యదేవుడి ప్రసాదానికి ఐఎస్వో

కాకినాడ, ఏప్రిల్ 22 (way2newstv.com
తూర్పుగోదావరి జిల్లాలోని  అన్నవరం సత్యదేముని దేవస్థానం లో ప్రసాదం తయారీ,  భక్తులకు అన్నదానం  అందించడంలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నందుకు గానూ  అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ హైమ్ ఇంటర్నేషనల్ ప్రయివేట్ లిమిటెడ్  ఐఎస్వో సర్టిఫికెట్ జారీచేసింది. నెల రోజుల క్రితం సంస్థ ప్రతినిధులు దేవస్థానం లోని పలు విభాగాలు సందర్శించి ఆయా విభాగాలు పాటిస్తున్న ప్రమాణాలు పరిశీలించారు. 


సత్యదేవుడి ప్రసాదానికి ఐఎస్వో 

అనంతరం 21 వ తేదీన సత్యదేముని దేవస్థానం ఈవో ఎంవీ  సురేష్ బాబు, చైర్మన్ ఐవీ రోహిత్, పాలకమండలి సభ్యులను కలసి ఐఎస్వో సర్టిఫికెట్ అందజేశారు. ఈ సందర్భంగా ఈవో సురేష్ బాబు  మాట్లాడుతూ దేవస్థానం లోని అన్ని విభాగాలలో స్వచ్ఛతా, ప్రమాణాలు పాటించుటలో ఆయా విభాగాల ఉద్యోగుల కృషిని ప్రశంసించారు. ఇలానే సోలార్ విద్యుత్ వాడకంలో ప్రమాణాలు పాటించి ఐస్వో  సర్టిఫికేట్ సాధిస్తామన్నారు. 
Previous Post Next Post