విజయవాడ, ఏప్రిల్ 26 (way2newstv.com):
నవ్యాంధ్ర రాజధాని నగరం విజయవాడలో మరో ప్రాజెక్టుకు కేంద్రం మొండి చెయ్యి చూపింది. నిధుల మంజూరుకు విముఖత వ్యక్తం చేసింది. ప్రాజెక్టు అంచనా వ్యయంపై అభ్యంతరాలు తెలుపుతూ దస్త్రాన్ని తిరుగుటపాలో పంపింది. ఇటీవల కాలంలో పలు ప్రాజెక్టులకు కేంద్రం నుంచి సహాయ నిరాకరణ వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బెంజి సర్కిల్ ఫ్లై ఓవర్ ఇక అసంపూర్తిగానే మిగిలిపోనుంది. కేవలం రూ.110 కోట్లు మంజూరు చేసేందుకు కేంద్రం ఏడాదిన్నర నుంచి ఫైళ్లను తిప్పిపంపుతోంది. ఎంపీ విజ్ఞప్తి చేసినా కనకరించడం లేదు. బెంజిసర్కిల్ మొదటిదశ పైవంతెన నిర్మాణానికి అంచనా వ్యయం రూ.82 కోట్లు. సర్వీసు రోడ్లు 1.5 మీటర్ల చొప్పున కుదించుకుపోనున్నాయి. పైవంతెన 1450 మీటర్లు, చెన్నై వైపు 310 మీటర్లు, ఏలూరు వైపు 570 మీటర్లు వెరసి మొత్తం 2,330 మీటర్ల దూరం ఈ వెంతెన ఉంటుంది. ఇక్కడ రమేష్ హాస్పిటలల్ జంక్షన్ తర్వాత దీనికి అండర్ పాస్‌లు ఏర్పాటు చేయడం లేదు.
మరింత ఆలస్యం (విజయవాడ)
మొత్తం 510 మీటర్లు వసుకుపోనుంది. అప్రోచ్ రహదారి మినహా పైవంతెన నిర్మాణం దాదాపు పూర్తయింది. ఏప్రిల్ 30 నాటికి ప్రారంభానికి సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం అప్రోచ్ రహదారిలో నిర్మాణం జరుగుతోంది. రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టారు. ఈ గోడ ఎత్తు ఎక్కువగా ఉంది. సాధారణంగా ఒకవైపు వంతెన దిగే సమయంలో ఎత్తును తగ్గిస్తూ ఏటవాలుగా నిర్మాణం చేస్తారు. కానీ బెంజి సర్కిల్ వంతెన ఎక్కడా ఏటవాలుగా రెండు వైపులా దిగలేదు. దీంతో అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి మట్టి అధికంగా అవసరమైంది.బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్ రెండోవైపు నిర్మాణానికి కేంద్రం అనుమతి లభించలేదు. గత ఏడాదిన్నరగా దీనికి ఆమోదం లభించడం లేదు. తాజాగా ప్రముఖ కన్సల్టెన్సీతోనే ఈ అంచనాలు రూపొందించింది. రైట్స్ సంస్థ భాగస్వామ్యంతో ఆకృతులు తయారు చేశారు. కన్సల్టెన్సీ అంచనాలతో పంపిన నివేదికన కేంద్రం తిరస్కరించింది. మొదటి దశకు రూ.82 కోట్లకే పూర్తయితే అదే పనులు రూ.110 కోట్లు ఎందుకు అవుతున్నాయంటూ ప్రశ్నించింది. అసలు 618 మీటర్ల దూరం ఎందుకు పొడిగించాల్సి వచ్చిందంటూ ప్రశ్నలు సంధించింది. దీనికి ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు వివరణలు పంపారు. బందరు హైవే విస్తరణలో ఫ్లై ఓవర్ చేపట్టడం, 2014-15 ఎస్‌ఎస్‌ఆర్ ధరల ప్రకారం చేపట్టడం వల్ల మొత్తం పెరిగినట్లనిపించినా తక్కువకే అయిందని వివరణ ఇచ్చారు. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి నగరం మధ్య నుంచి వెళ్తున్నందున ప్రజాప్రతినిధులు సుదీర్ఘ పైవంతెన ప్రతిపాదించిన విషయాన్ని వివరించారు. దీనికి ఆర్థిక శాఖ ఆమోదం లేదంటూ మరోసారి తిప్పి పంపింది. ప్రస్తుతం ఆర్థిక శాఖ ఆమోదం తెలిపితే దీనికి టెండర్లను పిలిచే అవకాశం ఉంటుంది. అంచనా వ్యయంపై సాంకేతికంగా పలు సందేహాలను కేంద్రం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. . ఇక కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు పెండింగ్‌లో ఉండాల్సిందే.