అమరావతి, ఏప్రిల్ 25, (way2newstv.com)
ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తాము చేసే పోరాటం అందరిలో స్ఫూర్తి నిoపుతోందని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గురువారం అయన టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చేది తామేనన్నారు. ఈవీఎంలపై తమ పోరాటం ఈనాటిది కాదన్నారు. దుర్మార్గుడు అధికారంలోకి రావటానికి ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేశాడని చంద్రబాబు పేర్కొన్నారు.
కౌంటింగ్ దాకా అప్రమత్తం
ఈ ఐదేళ్లు అధికారులు తమకెంతో సహకరించారని.. అధికారుల సహకారంతోనే అనేక రంగాల్లో తాము నంబర్ 1గా నిలిచామన్నారు. అన్ని సవాళ్లను సమర్థంగా ఎదుర్కొన్నామన్నారు. వచ్చ నెల 1 నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఎన్నికలు పూర్తి కావడంతో ప్రత్యర్ధుల కుట్రలు ముగియలేదని.. ఫలితాలు వెల్లడి అయ్యేదాకా వైసీపీ, బీజేపీ కుట్రలు కొనసాగుతాయన్నారు. కులం, మతం, వ్యక్తిగత అజెండాలతో... అధికారుల మధ్య చీలిక తెచ్చేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. దీనిని కూడా సమర్థంగా తిప్పికొడదామని చంద్రబాబు పేర్కొన్నారు.కౌంటింగ్ ఏజెంట్లకు నియోజకవర్గాల వారీగా శిక్షణ ఇవ్వాలని సూచించారు. పార్లమెంటు, అసెంబ్లీ అభ్యర్ధుల ఓట్లలో తేడాలు ఉన్నాయని అయన అన్నారు. కౌంటింగ్ పూర్తయ్యేదాకా అందరూ అప్రమత్తంగా ఉండాలని అయన సూచించారు. చంద్రబాబు పేర్కొన్నారు.