దిగుబడిపై దిగాలు (విజయనగరం) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

దిగుబడిపై దిగాలు (విజయనగరం)

విజయనగరం, ఏప్రిల్ 20(way2newstv.com): 
రాష్ట్రంలోనే మామిడి సాగులో మూడో స్థానంలో ఉన్న జిల్లాకు ఈసారి షాక్ తప్పేలా లేదు. ఈ ఏడాది పూత ఆశాజనకంగా ఉన్నా దిగుబడి లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ధర బాగుందని సంతోష పడ్డ వారంతా చివరకు దిగుబడులు లేక దిగాలు పడుతున్నారు. గతేడాది దిగుబడి ఉంటే ధర లేక వ్యాపారులు అడిగినంతకు విక్రయించుకోవాల్సి వచ్చింది. ఈ ఏడాది పరిస్థితులు మారాయి.ఇతర రాష్ట్రాలకు మామిడిని ఏటా రైతులు ఇక్కడి నుంచి ఎగుమతి చేస్తున్నారు. స్థానికంగా ఉన్న వ్యాపారుల సహకారంతోనే ఎగుమతులు సాగుతున్నాయి. గిట్టుబాటు ధర ఇక్కడ లేకపోవడంతో ఏకంగా విదేశాలకు ఎగుమతి చేయాలన్న ఆలోచనకు రైతులు వచ్చారు. గతేడాది జర్మనీకి ఎగుమతి అయ్యాయి. ఈ ఏడాది సింగపూర్‌ నుంచి కూడా ఆర్డర్లు వచ్చాయి. ఈ మేరకు ఉద్యానశాఖ అధికారుల ప్రోత్సాహంతో విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఉన్నత స్థాయిలో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సంవత్సరం కూడా ఎగుమతులు చేసి రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రణాళికలు రచించారు. ఆ స్థాయిలో జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. ఇప్పుడు మామిడి దిగుబడులు తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.


దిగుబడిపై దిగాలు (విజయనగరం)

ప్రతి ఏటా మన ప్రాంతం నుంచి పనుకులు ఎగుమతి అవుతున్నాయి. గతేడాది టన్ను రూ.6 వేల ధర పలికిన పనుకులు ఇప్పుడు రూ.60 వేల ధర పలుకుతోందని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల వ్యాపారులు రైతుల నుంచి నేరుగా రూ.40 వేల వరకు కూడా కొనుగోలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు. నాణ్యత మేరకు రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు ధర పలుకుతున్నట్లు అధికారులు అంటున్నారు. పనుకులు ఏప్రిల్‌ మొదటి వారం నుంచి కోతకు వస్తాయి. ఈ ఏడాది ఇంకా పూర్తిస్థాయిలో రాలేదు. పూత బాగానే ఉన్నా కాపునకు వచ్చే సరికి రాలిపోయాయని రైతులు అంటున్నారు. చివరి వరకు కాపు నిలవలేదంటున్నారు. పనుకులు సింగపూర్‌కు ఎగుమతి చేసేందుకు ఒప్పందం కుదిరింది. రైతుల నుంచి కొనుగోలు చేసి ఎగుమతులు చేసే విధంగా అధికారులు ప్రోత్సహిస్తున్నారు. జిల్లా సువర్ణరేఖ, పనుకుల రకాలకు పెట్టింది పేరు. వీటికి అంతర్జాతీయంగా డిమాండు ఉంది. పనుకులతోపాటు సువర్ణరేఖ రకం సింగపూర్‌కు ఎగుమతి చేస్తుంటారు. గతేడాది సుమారు వెయ్యి టన్నుల వరకు ఎగుమతి చేశారు. ఇపుడు రెండువేల టన్నుల వరకు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి కార్గో విమానంలో సింగపూర్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రైతుల వద్ద తోటలను లీజుకు తీసుకుని వ్యాపారులు పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ కారణంగా ఆయా వ్యాపారులు ఇక్కడ పండిన పంటను తరలించడం పరిపాటి. దిగుబడి తగ్గడంతో పాటు స్థానిక వర్తకుల ఒప్పందాలతో విదేశాలకు ఏ మేరకు ఎగుమతి చేయగలమో అన్నది ఇప్పుడు అధికారులు లెక్కలు వేస్తున్నారు. పొరుగు ప్రాంతాలకు చెందిన వ్యాపారులు రైతులను ఆశ్రయించి తోటల్లోనే మామిడిని కొనుగోలు చేస్తున్నారు. రైతులు కూడా నిల్వ చేసుకునేందుకు సరైన అవకాశం లేక విక్రయించేస్తున్నారు. రైతు అడిగిన ధరకు ఇచ్చేస్తున్నారు. నిల్వ చేసుకునే సదుపాయం లేకపోవడం ప్రధాన కారణంగా చెప్పవచ్ఛు