సర్కారీ భూముల్లో జియో ట్యాగింగ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సర్కారీ భూముల్లో జియో ట్యాగింగ్

కరీంనగర్ , ఏప్రిల్ 22, (way2newstv.com)
అక్రమణలకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో జియో ట్యాగింగ్‌కు సిద్ధమవుతోంది సర్కార్. రోజురోజుకూ భూములకు డిమాండ్ పెరుగుతున్నది.  ప్రభుత్వ భూములు కబ్జాలకు గరయ్యే ప్రమాదమున్నది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూములను సర్వేనంబర్ల వారీగా జియోట్యాగింగ్‌చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు వచ్చిన ఆదేశాలతో కరీంనగర్ జిల్లాయంత్రాగం సిద్ధమవుతున్నది. రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ కేంద్రం అనుసంధానంతో ఇప్పటికే అసెట్ మ్యాపింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నది. ఉమ్మడి జిల్లాలో 320 అలయాల పరిధిలో 3,223 ఎకరాల భూమి ఉన్నట్లుగా దేవాదాయ శాఖ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో 53ఆలయాలకు చెందిన 559 ఎకరాలకు పట్టాలున్నాయి. మిగతా 2,664 ఎకరాలకు పట్టాదారు పాసుపుస్తకాలు లేవు. దీంతో వందలాది ఎకరాలు ఆక్రమణ పాలయ్యాయి, అలాగే ఉమ్మడి జిల్లాలో 1,828 ఎకరాల వక్ఫ్ భూములున్నట్లు ఆ శాఖాధికారుల రికార్డులు చెపుతున్నాయి. ఇందులో వెయ్యికి ఎకరాలకుపైగా కబ్జా పాలయ్యాయి. వీటిని తిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నా, అధికారులు ఏమేరకు విజయం సాధిస్తారన్న దానిపై మాత్రం అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


సర్కారీ భూముల్లో జియో ట్యాగింగ్ 

కరీంనగర్ జిల్లాలో 16 మండలాలు ఉండగా, ఇప్పటికే తొమ్మిది మండలాల నుంచి వివరాలు తీసుకున్నారు. మిగిలిన మండలాలనుంచి సేకరిస్తున్నారు. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకొని జియో ట్యాగింగ్ చేయనున్నారు. ఈ మేరకు ప్రయోగాత్మకంగా కరీంనగర్ జిల్లాను ఎంపిక చేసి, ఆదేశాలు జారీ చేయగా అధికారయంత్రాంగం రంగంలోకి దిగింది. ఇప్పటికే సర్వే నంబర్ల వారీగా ప్రభుత్వ భూముల వివరాలు సేకరిస్తూనే, వచ్చే వారం నుంచి ట్యాగింగ్‌ను ప్రారంభించనున్నది. ఇక్కడ పూర్తయిన వెంటనే రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలో ఈ ప్రక్రియ చేపట్టనున్నది. ఉమ్మడి జిల్లాలో 3,68,808 ఎకరాల ఖాళీ స్థలం ఉందని పేర్కొంటూ వివరాలు సర్కారుకు పంపించారు. ఆ తర్వాత గుర్తించిన భూముల్లో పరిశ్రమలు పెట్టుకోవడానికి అనువైన భూములు ఎన్ని ఉన్నాయో గుర్తించి పంపించాలని 2014 సెప్టెంబర్‌లో ప్రభుత్వం తిరిగి ఆదేశాలు జారీ చేసింది.ఈ మేరకు రంగంలోకి దిగిన అధికారులు, రెవెన్యూ శాఖ ఇచ్చిన రికార్డులను పరిగణలోకి తీసుకొని క్షేత్రస్థాయిలో సర్వే చేశారు. మొత్తం 3.68 లక్షల ఎకరాల్లో 56.088 ఎకరాల భూమి పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా ఉన్నట్లు గుర్తించారు. ఈ భూములను నాలుగు కేటగిరీలుగా విభజించి, ఇందులో ఏ కేటగిరి కింద 12,940.29 ఎకరాలు భూమి అందుబాటులో ఉందని లెక్క తేల్చారు.కొత్తగా ఏర్పడిన కరీంనగర్ జిల్లాలో తాజాగా నిర్వహించిన గణాంకాల ప్రకారం చూస్తే జిల్లాలో22,177 ఎకరాల ప్రభుత్వ భూమికి 2,487 ఎకరాల భూమి కబ్జా అయినట్లు అధికారులు తేల్చారు. ఇందులో కేవలం ఎడెకరాలను మాత్రమే అధికారులు తిరిగి స్వాధీనం చేసుకోగా, మరో 47 ఎకరాల వివాదం కోర్టులో నడుస్తున్నది. ఇంకా 2,431 ఎకరాలు ఇతరుల కబ్జాల్లో ఉన్నట్లు అధికారులే చెబుతున్నారు.