దీదీకి టఫ్ టైమ్స్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

దీదీకి టఫ్ టైమ్స్

బెంగాల్, ఏప్రిల్ 2, (way2newstv.com)
మమత బెనర్జీ…. పశ్చిమ బెంగాల్ లో పులి వంటి నేత. జాతీయ రాజకీయాల్లోనూ ఆమె రాణించే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నది విశ్లేషకుల అంచనా. మరోసారి బెంగాల్ బెబ్బులి పంజా విసిరేందుకు సిద్ధమయ్యారు. మమత ఈ ఎన్నికలలో అటు భారతీయ జనతా పార్టీని, ఇటు కాంగ్రెస్, కమ్యునిస్టు పార్టీలను చావుదెబ్బ తీయాలని భావిస్తున్నారు. అందుకు తగిన వ్యూహ ప్రతి వ్యూహాలను రచించారు. ఎక్కువ మంది మహిళలకు సీట్లు ఇవ్వడం, సిట్టింగ్ లను కొందరిని పక్కన పెట్టడం మమతకు కలసి వస్తుందని అంచనా వేస్తున్నారు.
ఆమెకు అన్నీ అనుకూలంగానే…..పశ్చిమ బెంగాల్ అనగానే నిన్న మొన్నటి వరకూ కమ్యునిస్టులు గుర్తుకు వస్తారు. కానీ అది చరిత్రగా మారనుంది. ఇప్పుడు ఆ రాష్ట్రం పేరు చెబితే విన్పించే ఒకే ఒక పేరు మమత. ఈ లోక్ సభ ఎన్నికల్లో తన సత్తా చాటి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని మమత భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే అన్నీ ఆమెకు అనుకూలంగానే జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్ లో గత కొద్దిరోజులుగా భారతీయ జనతా పార్టీ పుంజుకుంటోంది. 


దీదీకి  టఫ్ టైమ్స్

స్థానిక సంస్థల ఎన్నికల్లో సయితం కాంగ్రెస్ కంటే మెరుగైన ఫలితాలను సాధించింది. దీంతో కమలం పార్టీ పశ్చిమ బెంగాల్ పై ప్రత్యేక ఆపరేషన్ ను పెట్టిందిఇక కలసి నడవాల్సిన వాళ్లే విడిపోవడంతో మమతకు కలసి వచ్చేలా ఉంది. కమ్యునిస్టులు, కాంగ్రెస్ పార్టీ విడివిడిగా పోటీ చేస్తుండటం కూడా మమతకు లాభమేనంటున్నారు. కమ్యునిస్టులు క్రమంగా తమ ప్రాభవాన్ని, ప్రభావాన్ని కోల్పోతున్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం పుంజుకునే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో బీజేపీ బల పడకుండా చేయడమే మమత ముందున్న లక్ష్యం. అందుకోసం ముస్లిం ఓట్లు చీలిపోకుండా ఆమె అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బీజేపీ లాభపడకుండా చేయడం మాత్రమే కాకుండా, కాంగ్రెస్ కు కూడా ఈ ఎన్నికల ద్వారా గుణపాఠం నేర్పాలన్న యోచనలో మమత ఉన్నారు.పశ్చిమ బెంగాల్ లో మొత్తం 42 పార్లమెంటు స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో మమత పార్టీ తృణమూల్ 34 స్థానాలను కైవసం చేసుకుంది. తిరిగి ఆ సంఖ్యను నిలబెట్టుకోవాలన్నది మమత ప్రయత్నం. తాజాగా ఏబీపీ-నిల్సన్ సర్వేను బట్టి చూస్తే మమత పార్టీకి మూడు సీట్లు తగ్గే అవకాశముంది. 31 స్థానాల్లో తృణమూల్, ఎనిమిది స్థానాల్లో భారతీయ జనా పార్టీ, మూడు స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందుతుందని సర్వే వెల్లడించింది. కమ్యునిస్టులు ఒక్క స్థానంలోనూ గెలిచే అవకాశం లేదని తెలిపింది. మమత అనుకుంటున్నట్లు 34 సీట్లు రాకపోయినా బీజేపీ ఎదుగుదలను ఆపలేకపోతారని సర్వే తేల్చింది. మొత్తం మీద చూస్తే మమతకు పశ్చిమ బెంగాల్ లో పరిస్థితులు ఏ మాత్రం మారలేదనే తెలుస్తోంది.