పవన్ కు ప్రభాస్ ఫ్యాన్స్ షాక్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పవన్ కు ప్రభాస్ ఫ్యాన్స్ షాక్

భీమవరం, ఏప్రిల్ 1(way2newstv.com)
జనం ఎక్కువగా అట్రాక్ట్ అయ్యేది ఒకటి సినిమాలకు.. రెండు రాజకీయాలకు. తమకు ఇష్టమైన హీరోలు రాజకీయాల్లో కీలకం అయితే ఆ మజానే వేరు. ప్రస్తుతం ఏపీలో ఇలాంటి పరిస్థితే ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడంతో.. 2019 ఎన్నికలు రంజుగా మారాయి. గత ఎన్నికల్లో టీడీపీకి సపోర్ట్ చేసి ఆ పార్టీ విజయంలో కీలక భూమిక పోషించిన పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేస్తున్నారు. పవర్ స్టార్ నుండి జనసేన అధినేతగా మారిన పవన్ కళ్యాణ్.. ఏపీలోని గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న గాజువాకతో సానుకూలమైన పవనాలు ఉన్నప్పటికీ భీమవరంలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అధికార, ప్రతిపక్షపార్టీలను నుండి గట్టిపోటీతో పాటు.. కులసమీకరణాలు కూడా ఇక్కడ కీలకంగా మారాయి. ఈ సందర్భంలో వివిధ హీరోల అభిమాన సంఘాలు కూడా వైసీపీ వైపు మొగ్గు చూపిస్తుండటం జనసైనికుల్లో కలవరం మొదలైంది. తాజాగా భీమవరంలో సినీ అభిమానుల సంఘాల ఆత్మీయ సమావేశం జరిగింది. ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోల అభిమాన సంఘాలు పాల్గొన్నాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నర్సాపురం ఎంపీ అభ్యర్థి రఘురాం కృష్ణం రాజుకు పారిశ్రామిక వేత్తగానే కాకుండా.. సినీ పరిశ్రమతో సంబంధాలు ఉండటంతో ఈ కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు. 


 పవన్ కు ప్రభాస్ ఫ్యాన్స్ షాక్

ఈ సమావేశంలో పాల్గొన్న ప్రభాస్ అభిమానులు వైసీపీకి మద్దతు ప్రకటించారట. మొదట్లో ప్రభాస్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్‌కి మద్దతుగా నిలవాలనే ప్రతిపాదనను సమర్ధించారట. అయితే రఘురాం కృష్ణం రాజు వైసీపీలో చేరడం.. అక్కడ రాజుల ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉండటంతో సమీకరణాలు పూర్తిగా మారినట్లు తెలుస్తోంది. మొదట్లో పవన్ కళ్యాణ్‌కి పోటీ చేయాలనుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పుడు వైసీపీకి మద్దతు ప్రకటించారట. భీమవరంలో ప్రభాస్‌కి ఫ్యాన్స్ ఎక్కువగానే ఉండటంతో ఆ ప్రభావం ఎంత వరకూ పనిచేస్తుందో చూడాలి. ఇక ప్రభాస్ పెదనాన్న క్రిష్ణంరాజు బీజేపీలోనే కొనసాగుతుండగానే.. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం వైసీపీ మద్దతు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిరేకెత్తిస్తున్నాయి. కాగా ఇటీవల ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌తో పాటు కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ జనసేనలో జాయిన్ అయ్యారు. వారి ప్రభావం ఎంత వరకూ పనిచేస్తుందో చూడాలి
కేఈ కుటుంబం నుంచి వారసుడిగా కేఈ శ్యాంబాబు పత్తికొండ నుంచి బరిలో దిగుతున్నారు. ఎంబీఏ పూర్తిచేసి శ్యాంబాబు ఇప్పటికే తండ్రికి మద్దతుగా రాజకీయాల్లో రాణిస్తున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఇదే తొలిసారి. ప్రతి గ్రామంలో సమస్యలు తెలుసుకుని తండ్రి ద్వారా పరిష్కరిస్తున్నారు. ప్రధానంగా పశ్చిమ ప్రాంతంలో ఉన్న పత్తికొండలో నీటి సమస్య తీర్చేందుకు హంద్రీనీవా నుంచి పైపులైను ద్వారా సమ్మర్‌స్టోరేజ్‌ ట్యాంకు నింపి ప్రజల మన్ననలు పొందారు. దీంతో గతంలో వేసవి వస్తే ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరిగేది. గత రెండేళ్లుగా ఆ సమస్య లేదు. అలాగే హంద్రీనీవా ద్వారా 68 చెరువులు నింపే కార్యక్రమానికి అడుగులు వేగంగా పడుతున్నాయి. 40-50ఏళ్ల నుంచి ఆదోని-గుత్తి మార్గంలో చిన్నహుల్చి వద్ద వర్షాకాలంలో రోడ్డుపై నీళ్లునిలిచి వాహనాలు గంటల తరబడి ఆగిపోయేవి. ఈ ఏళ్లనాటి సమస్యకు రూ.3.70కోట్లతో వంతెన నిర్మాణం జరగడంలో శ్యాంబాబు కృషిచేశారు. ఇలా ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ కొత్త పంథాలో ముందుకెళుతున్నారు.