పార్టీ ప్రతినిధులతో కలెక్టర్ భేటీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పార్టీ ప్రతినిధులతో కలెక్టర్ భేటీ

నాగర్ కర్నులు, ఏప్రిల్ 10 (way2newstv.com)
లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం రిసెప్షన్ కేంద్రంలో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లో భద్ర పరిచేముందు అన్ని పార్టీల అభ్యర్థులు, లేదా వారి ప్రతినిధుల సమక్షంలోనే భద్రపరచడం జరుగుతుందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఇ.శ్రీధర్ తెలిపారు.  గురువారం లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ నిర్వహిస్తున్న దృష్ట్యా బుధవారం ఆయన కలెక్టర్ కార్యాలయంలో పోటీలో ఉన్నఅభ్యర్థులు, వారి ప్రతినిధుల తో సమావేశం నిర్వహించారు. పోలింగ్ ముగిసిన అనంతరం  పోలింగ్ ఏజెంట్లు సమక్షంలో వి వి పిఏ టి లకు ఉన్న బ్యాటరీని తొలగించి తీసుకువెళ్లేలా  కేంద్ర ఎన్నికల సంఘం నుండి ఆదేశాలు వెలువడిన ట్లు కలెక్టర్ అభ్యర్థులకు తెలియజేశారు. ఈ విషయాన్ని బల్క్ ఎస్ ఎం ఎస్ ల ద్వారా ప్రిసైడింగ్ అధికారులకు తెలియ చేయడం జరిగిందని, అంతేకాక డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో కూడా తెలియజేస్తున్నట్లు వెల్లడించారు.  మోక్  పోల్ నిర్వహణ తర్వాత వి.వి పి ఏటి స్లిప్పులు కలిగిన పింకు సీల్ చేసిన డబ్బా ను కూడా స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచాలని  ఆదేశాలు అందినట్లు వెల్లడించారు. 


పార్టీ ప్రతినిధులతో కలెక్టర్ భేటీ

మాక్ పోల్ నిర్వహణ తర్వాత సి ఆర్ సి గురించి అభ్యర్థులకు వివరించారు.మాక్ పోల్ నిర్వహణ విషయమై ప్రిసైడింగ్ అధికారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు గాను ఒక వాల్ పోస్టర్ ను రూపొందించి గోడకు అతికించడం జరిగిందని, మాక్ పోల్ తర్వాత crc ఎలా చేయాలో అందులో దశలవారీగా సూచించినట్లు తెలిపారు.   లోక్ సభ ఎన్నికలలో పోటీలో ఉన్న అభ్యర్థికి, ఒక ఏజెంటుకు, అలాగే నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని 7 సెగ్మెంట్లకు ఏడు వాహనాలు, మొత్తం తొమ్మిది వాహనాలను అనుమతించడం జరుగుతుందని ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టం చేశారు. అభ్యర్థులు, వారి ఏజెంట్లు డిస్ట్రిబ్యూషన్ కేంద్రంతో పాటు రిసెప్షన్ కేంద్రానకి  కూడా వెళ్లవచ్చని, ఎన్నికల సామాగ్రి పంపిణీ, రిసెప్షన్ కేంద్రంలో మెటీరియల్ తీసుకోవడం వంటి ప్రక్రియలను పరిశీలించవచ్చని ఈ సందర్భంగా ఆయన వివరించారు. అయితే ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచే ముందుమాత్రం   అభ్యర్థులు లేదా వారి ఏజెంట్లు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.  డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలతోపాటు అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రథమ చికిత్స ఏర్పాట్లు చేశామని కలెక్టర్ పేర్కొన్నారు.       ఎన్నికల పోలింగుకు సంబంధించిన సమాచారాన్ని, ఫిర్యాదులు, ఇతర సమాచారాన్ని తెలుసుకునేందుకు గాను అంతేకాక ఒకే చోట నుండి ఎన్నికల పోలింగ్ సరళిమొత్తాన్ని పర్యవేక్షించేందుకు గాను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను  ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.   ఈ సమావేశానికి పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి ప్రతినిధుల తో పాటు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీ రాములు, వెంకటయ్య తదితరులు హాజరయ్యారు.