ఎన్నికలకు అన్నీ ఏర్పాట్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఎన్నికలకు అన్నీ ఏర్పాట్లు

సిద్ధిపేట, ఏప్రిల్ 10 (way2newstv.com)
 ఏప్రిల్ 11వ తేది గురువారం జరుగనున్న లోక్సభ ఎన్నికలకు సిద్ధిపేట జిల్లా సిద్ధమైందని, పోలింగ్ నిర్వహణ కోసం జిల్లా అధికారిక యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ క్రిష్ణ భాస్కర్ వెల్లడించారు. సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం ఉదయం పోలీసు కమిషనర్ జోయల్ డేవీస్, జిల్లా జాయింట్ కలెక్టర్ పద్మాకర్, డీఆర్వో చంద్రశేఖర్ లతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. సిద్ధిపేట జిల్లాలో మెదక్ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో సిద్ధిపేట, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలు, కరీంనగర్ లోకసభ పరిధిలోకి హుస్నాబాద్ నియోజకవర్గం ఉండగా, జిల్లాలోని చేర్యాల, కొమురవెళ్లి, మద్దూర్ మండలాలు భువనగిరి లోకసభ సెగ్మెంట్ పరిధిలో ఉన్నాయని, ఈ మూడు సిద్ధిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల పరిధిలో జిల్లాలో మొత్తం 9,74,001 మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం 1259 పోలింగ్ కేంద్రాలు ఉండగా, ఇందులో 48 లోకేషన్లలో 69 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు గుర్తించినట్లు, పోలింగ్ కోసం 1137 కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీ ప్యాట్లను వినియోగిస్తున్నట్లు, మరో 300 కంట్రోల్ యూనిట్లు, 375 బ్యాలెట్ యూనిట్లు, 539 వీవీప్యాట్లు రిజర్వులో అందుబాటులో నిలిపినట్లు తెలిపారు.


ఎన్నికలకు అన్నీ ఏర్పాట్లు

జిల్లా వ్యాప్తంగా 108 పోలింగ్ కేంద్రాలలో వీడియో కెమెరాలు, 245 కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు  చేసినట్లు, జిల్లాలో ప్రీసైడింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రీసైడింగ్ ఆఫీసర్లు, అడిషనల్ ప్రీసైడింగ్ ఆఫీసర్లు మొత్తం 4719 మంది సిబ్బంది పోలింగ్ ప్రక్రియలో పాల్గోనున్నారని పేర్కొన్నారు. పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా జరిపేలా 5 కంపెనీల సీఆర్ఫీఎఫ్, 450 మంది స్టేట్ పోలీసు అధికారులు, 550 మంది హోమ్ గార్డులు శాంతిభద్రతలను పర్యవేక్షించనున్నారని చెప్పారు. నియోజకవర్గాల వారీగా చూస్తే మెదక్ పార్లమెంటు పరిధిలోని సిద్ధిపేట, గజ్వెల్, దుబ్బాక మూడు నియోజకవర్గాల్లో మొత్తం 6,65,393 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 3,30,573 మంది పురుషులు, 3,34,805 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 14 మంది ఉన్నారని, కరీంనగర్ లోకసభ పరిధిలోని హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,36,914 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 1,17,534 మంది పురుషులు, 1,19,318 మంది మహిళా ఓటర్లు 2 ఇతరులు ఉన్నట్లు వెల్లడించారు. భువనగిరి లోకసభ పరిధిలోని చేర్యాల, కొమురవెళ్లి, మద్దూరు మండలాల్లో మొత్తం 71,694 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని పేర్కొన్నారు.