తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల

హైదరాబాద్, ఏప్రిల్ 26 (way2newstv.com)
పాలీ సెట్ 2019 ఫలితాలు  సాంకేతిక విద్యశాఖ  కమిషనర్ నవీన్ మిట్టల్ శుక్రవారం విడుదల చేసారు. 92.53 శాతం ఉత్తీర్ణత వుందని అయన తెలిపారు. స్టేట్ మొదటి ర్యాంకు సిద్ది పేట జిల్లాకు చెందిన  మంకాల సృజన  సాధించగా, రెండవ ర్యాంక్ సూర్యాపేట జిల్లాకు చెందిన  ఆరురి సాత్విక్  సాధించారు. 


తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల

మే మొదటి వారంలో కౌన్సిలింగ్ ప్రారంభం అవుతుంది. న్ మొదట వారంలో తరగతులు ప్రారంభం అవుతాయని అయన అన్నారు. ఈ యేడాది  1,06,295 మంది అభ్యర్థులు పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోగా వారిలో 1,03,587 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు అయ్యారు. 92.53 శాతం..95,850 అభ్యర్థులు ఉత్తీర్ణత అయ్యారు. 61505 బాలురకు గాను ,55933 మంది ఉత్తీర్ణత 90.94శాతం వుండగా 42082బాలికల కు గాను 39917మంది ఉత్తీర్ణత 94.86శాతం వుందని అయన తెలిపారు.
Previous Post Next Post