సిరిసిల్ల, ఏప్రిల్ 26 (way2newstv.com)
వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని కలెక్టర్ పి వెంకట్రామ రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో టీఎన్‌జీఓస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కలెక్టర్ శ్రీ పి వెంకట్రామ రెడ్డి ప్రారంభించారు.
చలివేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టీఎన్‌జీఓస్ సామాజిక బాధ్యతగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం వివిధ పనుల నిమిత్తం కలెక్టరేట్ కు వచ్చే ప్రజలతో పాటు బాటసారుల దాహాన్ని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు ఎలుసాని ప్రవీణ్‌కుమార్, ఏవో బి గంగయ్య , సంఘ సభ్యులు నాగరాజు , ప్రవీణ్ , ఇతర సభ్యులు , కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొన్నారు .