అమిత్ షా...రక్షణ మంత్రేనా... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అమిత్ షా...రక్షణ మంత్రేనా...

న్యూఢిల్లీ, మే 22 (way2newstv.com):

ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎన్డీయే కూటమి విజయం ఖాయమని తేల్చిన వేళ.. మరోసారి అధికారంలోకి వస్తామని బీజేపీ ధీమాతో ఉంది. ఎవరెవరికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే విషయమై అప్పుడే ప్రచారం జోరందుకుంది. బీజేపీ చీఫ్ అమిత్ షా రక్షణ మంత్రిగా లేదంటే హోం మంత్రిగా బాధ్యతలు చేపడతారనే ప్రచారం జరుగుతోంది. హోం శాఖ బాధ్యతలను సీనియర్ నేత రాజ్‌నాథ్ సింగ్ పర్యవేక్షిస్తున్నందున.. అమిత్ షా రక్షణ శాఖను దక్కించుకునే అవకాశాలే ఎక్కువని పార్టీ అంతర్గత వర్గాల సమాచారం. మోదీ నమ్మిన బంటు అమిత్ షా కేబినెట్‌లో చేరతారని, ఆయనకు కీలక రక్షణ శాఖ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం నడుస్తోంది. 

అమిత్ షా...రక్షణ మంత్రేనా...

హోం శాఖ బాధ్యతలను సీనియర్ నేత రాజ్‌నాథ్ సింగ్ పర్యవేక్షిస్తున్నందున.. అమిత్ షా రక్షణ శాఖను దక్కించుకునే అవకాశాలే ఎక్కువని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.బీజేపీ చీఫ్‌గా అమిత్ షా పదవీకాలం డిసెంబర్‌తో ముగియనుంది. ఈ నేపథ్యంలో.. ఆయనకు మంత్రి పదవి ఇస్తారని, తిరిగి 2024 ఎన్నికల ముందు మళ్లీ పార్టీ పగ్గాలను ఆయనకు అప్పగిస్తారని సమాచారం. అంతే కాదు ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత ఎన్డీయే అధికారంలోకి వస్తే.. ఆ ప్రభావం కర్ణాటక, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలపై పడే అవకాశం ఉంది. కర్ణాటకలో కాంగ్రెస్ మద్దతుతో జేడీఎస్ నేత కుమారస్వామి సీఎంగా ఉండగా.. మధ్యప్రదేశ్‌లో కమల్ నాథ్ సర్కారు బొటాబొటి మెజార్టీతో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. ఈ రెండు రాష్ట్రాల్లోనూ కాషాయ పార్టీ ప్రభుత్వాలు ఏర్పాటవుతాయని జోరుగా ప్రచారం సాగుతోంది.