చెన్నై, మే 13 (way2newstv.com)
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తమిళనాడు పర్యటన కొనసాగుతోంది. తాజాగా చెన్నైలోని ఆళ్వార్పేటలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ నివాసానికి ఆయన వెళ్లారు. కేసీఆర్కు స్టాలిన్ సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు సమావేశమయ్యారు.
‘స్టాలిన్ తో సీఎం కేసీఆర్ భేటీ
దేశంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణాలపై చర్చించడంతో పాటు ఫెడరల్ ఫ్రంట్ బలోపేతానికి సహకరించాల్సిందిగా స్టాలిన్ను కేసీఆర్ కోరినట్లు తెలుస్తోంది. కేంద్రంలో ప్రాంతీయ పార్టీల సహకారంతో కాంగ్రెస్, బీజేపీ ఏతర ప్రభుత్వాలు అధికారంలోకి రావాలంటూ గత కొద్ది రోజులుగా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే స్టాలిన్తో కేసీఆర్ భేటీ అయ్యారు.