నల్గొండ మే 13 (way2newstv.com)
ఎన్నికలు ఏవైనా గెలిచేది టీఆర్ఎస్ పార్టీనే అని మంత్రి జగదీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ స్థానిక సంస్థల టీఆరెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తేరా చిన్నపరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీలు బడుగుల లింగయ్యాయదవ్, గుత్తా సుఖేందర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడిన ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తెర చిన్నప రెడ్డి ఘన విజయం సాధిస్తారని మంత్రి జోస్యం చెప్పారు.
ఎన్నికలు ఏవైనా సరే గెలిచేది టీఆర్ఎస్సే..: మంత్రి జగదీష్ రెడ్డి
ప్రాదేశిక ఎన్నికల్లో కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడు జడ్పీ చైర్మెన్ స్థానాలు టీఆరెస్‌వేనని జగదీష్ రెడ్డి చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆరెస్ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిందన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో తన వంతు పాటు పాటుపడతానని చిన్నప్పరెడ్డి చెప్పుకొచ్చారు. జిల్లాలో మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేల సహకారంతో ఘన విజయం సాధిస్తానని చిన్నపరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.