ఎండలతో ఆవిరవుతున్న నీళ్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఎండలతో ఆవిరవుతున్న నీళ్లు

హైద్రాబాద్, మే  16, (way2newstv.com)
ఎండల తీవ్రత పెరగటంతో ప్రధాన రిజర్వాయర్లలో నీటి నిల్వ తగ్గిపోయింది. జూన్‌ నెలాఖరు వరకూ రాష్ట్ర ప్రజల తాగునీటి అవస రాలకు నీటిని వినియోగించుకోవాల్సి ఉంది. వర్షాలు సకాలంలో కురవక పోతే తాగునీటికి కూడా కటకట ఏర్పడే ప్రమాదం ఉన్నదని నీటిపారుదల శాఖ అధికారులంటున్నారు. అయితే గత సంవ త్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం పరిస్థితి కొంత మెరుగ్గానే ఉన్నదని వారు భావిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 799 అడుగులకు చేరుకున్నది. ఈ ప్రాజెక్టులో 834 అడుగులకు చేరుకుంటే కనీస నీటి మట్టంగా భావిస్తారు. నెల రోజుల క్రితయే ఈ ప్రాజెక్టులో నీటి నిల్వ డెడ్‌ స్టోరేజీకి చేరుకున్నది. ఈ రిజర్వా యర్‌లో పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ కేవలం 28.34 టీఎంసీలుగా ఉన్నది. దీనిలో కేవలం 8.34 టీఎంసీలు మాత్రమే వినియోగించుకునే అవకాశం ఉన్నది. 


ఎండలతో ఆవిరవుతున్న నీళ్లు

ఈ సంవత్సరం శ్రీశైలం గేట్ల ద్వారా సాగర్‌ కు నీరు విడుదల చేయటంతో నాగార్జునసాగర్‌ కింద యాసంగి పంటలకు కూడా నీరిచ్చారు. సాగర్‌లో పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 512.7 అడుగులుగా ఉన్నది. ఈ ప్రాజెక్టులో నీటి మట్టం 510 అడు గుల స్థాయికి చేరుకుంటే కనీస నీటి మట్టంగా భావిస్తారు. మే నెలాఖరు వరకూ 510 అడుగుల కంటే నీరు తగ్గకుండా చూడాలని కృష్ణా బోర్డు సమావేశంలో తెలంగాణ, ఏపీ నిర్ణయించాయి. సాగర్‌లో పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 136 టీఎంసీ లుగా నమోదయింది. ఈ రిజర్వాయర్‌లో కనీసం 100 టీఎంసీలు భవిష్యత్‌ అవసరాల కోసం క్యారీ ఓవర్‌ స్టోరేజీగా ఉంచాలని నిర్ణయించారు. సాగర్‌ లో 510 అడుగుల స్థాయి కన్నా నీరు తగ్గితే నల్ల గొండ జిల్లాతో పాటూ జంటనగరాలకు నీటిని సర ఫరా చేయటానికి ప్రత్యేక మోటర్లు ఏర్పాటు చేయా ల్సి ఉంటుంది. జూరాల ప్రాజెక్టులో కూడా నీటి నిల్వ తగ్గిపోయింది. ఈ ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్ద్యం 9.6 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 3.4 టీఎంసీలుగా ఉన్నది. యాసంగి పంటలు కాపాడటానికి, తాగునీటికి రెండు టీఎంసీల నీటిని నారాయణపూర్‌ రిజర్వాయర్‌ నుంచి విడుదల చేయాలని తెలం గాణ కోరటంతో కర్నాటక ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. ఈ రిజర్వా యర్‌లో నీటి నిల్వ 1.5 టీఎంసీల కన్నా తగ్గితే మహబూబ్‌నగర్‌ జిల్లాకు తాగునీరందించటానికి ప్రత్యేక మోటర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కృష్ణా బేసిన్‌లో వర్షాలు ఆలస్యంగా కురుస్తాయి. గత అను భవాల్ని దృష్టిలో ఉంచుకుని మూడు ప్రధాన రిజర్వాయర్లలో నీటిని జాగ్రత్తగా వినియోగించుకో వాలని కృష్ణా బోర్డు సూచించింది. రెండు రాష్ట్రాల తాగునీటి అవస రాల కోసం మే నెలాఖరు వరకూ బోర్డు నీటి కేటాయింపులు గతంలో చేసింది. శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్ధ్యం 90.31 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 6.75 టీఎంసీలుగా ఉన్నది. నిజాంసాగర్‌లో పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 14 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ కేవలం 2.5 టీఎంసీలు మాత్రమే ఉన్నది. ఈ రెండు ప్రాజెక్టుల్లో పూడిక పెరిగి పోవటంతో నీటి నిల్వ సామర్ధ్యాన్ని కోల్పోతు న్నాయి. జంటనగరాలకు తాగునీరందించే ఎల్లం పల్లి ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 20.17 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 6.29 టీఎంసీలుగా ఉంది