నిజామాబాద్ లో నేచర్ పార్క్

నిజామాబాద్, మే 16, (way2newstv.com)
నిజామాబాద్ జిల్లా రూరల్ మండలంలోని సారంగాపూర్ శివారులో ఏర్పాటు చేసిన అటవీ ఉద్యానవనం ప్రారంభానికి సిద్ధమైంది. 50 ఎకరాల అటవీ విస్తీర్ణంలో ఏర్పాటుచేసిన ఈ పార్క్ పనులను రెండేళ్ల కిందటప్రారంభించారు.జాతీయ వన్య ఉద్యాన యోజన కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ ఉద్యానవనానికి 60 శాతం నిధులు కేంద్రం అందిస్తుండగా, 40 శాతం నిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స‌మ‌కూర్చింది.నగర వాసులకు చల్లటి వాతావరణం అందించేందుకు నేచర్ పార్కు సిద్ధమైంది. త్వరలోనే ఈ పార్కు ప్రకృతి ప్రేమికులకు అందుబాటులోకి రానుంది. వారాంతంలో పచ్చని ప్రకృతిలో సేద తీరేందుకు ఆనువుగా ఉంటుంది.  నగర వాసులకు చల్లటి వాతావరణం అందించేందుకు నేచర్ పార్కు సిద్ధమైంది. త్వరలోనే ఈ పార్కు ప్రకృతి ప్రేమికులకు అందుబాటులోకి రానుంది. వారాంతంలో పచ్చని ప్రకృతిలో సేద తీరేందుకు ఆనువుగా ఉంటుంది.నిజామాబాద్ జిల్లా ఇప్పుడిప్పుడే పర్యాటకంగా అభివృద్ధి చెందుతోంది. ప్రభుత్వ చొరవతో ఇప్పుడు నగర శివారులోని సారంగాపూర్‌లో 50 ఎకరాల్లో నేచర్ పార్కును అందుబాటులోకి తీసుకువస్తున్నారు.  నిజామాబాద్ జిల్లా ఇప్పుడిప్పుడే పర్యాటకంగా అభివృద్ధి చెందుతోంది.


నిజామాబాద్ లో నేచర్ పార్క్

సారంగపూర్ అటవీ ప్రాంతం 125 చదరపు హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. నగరం రోజురోజుకూ విస్తరిస్తుండటంతో అటవీ స్థలాలు కబ్జా అవున్నాయి. కబ్జాల నుంచి కాపాడేందుకు అటవీశాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. అట‌వీ భూమిలోని 50 ఎకరాల్లో నేచర్ పార్క్ నిర్మాణం చేపట్టింది. పార్కులో అన్ని వ‌య‌సుల వారికి సౌకర్యంగా ఉండేలా సిద్ధం చేసింది. రెండున్నర కోట్లతో నిర్మాణ పనులు ప్రారంభించింది. అటవీ ప్రాంతంలోని నేచర్ పార్కును సహజసిద్ధంగా నిర్మించారు. అడవిలో ఉన్న చెట్లను నరికివేయకుండా పరిసరాలను అందంగా తీర్చిదిద్దారు. రెండున్నర కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్, యోగా సెంటర్, చిల్డ్రన్ అడ్వెంచర్, బటర్ ఫ్లై గార్డెన్, క్యాంటీన్ నిర్మించారు.  అటవీ ప్రాంతంలోని నేచర్ పార్కును సహజసిద్ధంగా నిర్మించారు. అడవిలో ఉన్న చెట్లను నరికివేయకుండా పరిసరాలను అందంగా తీర్చిదిద్దారు. రెండున్నర కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్, యోగా సెంటర్, చిల్డ్రన్ అడ్వెంచర్, బటర్ ఫ్లై గార్డెన్, క్యాంటీన్ నిర్మించారు.కొండపై అటవీ సీనరీస్ చూడడంతో పాటు ప్రజలు సేద తీరేందుకు చక్కని నివాస ఆవాసాల్నీ, చెక్ డ్యాములు, అందమైన పూల మొక్కల మధ్య నిర్మిస్తున్నారు. వీటికి తోడు అద్భుతమైన విద్యుత్ అలంకరణ చేపట్టారు.  కొండపై అటవీ సీనరీస్ చూడడంతో పాటు ప్రజలు సేద తీరేందుకు చక్కని నివాస ఆవాసాల్నీ, చెక్ డ్యాములు, అందమైన పూల మొక్కల మధ్య నిర్మిస్తున్నారు. వీటికి తోడు అద్భుతమైన విద్యుత్ అలంకరణ చేపట్టారు. వేసవిలో రాత్రిపూట చల్లని గాలులలో తిరిగేందుకు రూ.25 లక్షలతో లైటింగ్ ఏర్పాటు చేశారు.  పచ్చని అందాలు నల్లటి రాళ్లతో కూడిన కొండల మధ్య ఏర్పడిన పార్క్ పర్యాటకులను ఆకట్టుకోనుంది. వేసవిలో రాత్రిపూట చల్లని గాలులలో తిరిగేందుకు రూ.25 లక్షలతో లైటింగ్ ఏర్పాటు చేశారు.నేచ‌ర్ పార్క్ ప‌నులు ఇప్పటికే పూర్తయ్యాయి. త్వరలోనే పార్క్‌ను ప్రారంభించి జిల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. 
Previous Post Next Post