మీరైన మా సమస్యలను పరిష్కారం చేయండి


నంద్యాల మే 25 (way2newstv.com)  

వైకాపా అధినేత  జగన్ మోహన్ రెడ్డి  రాయలసీమ సమస్యలను పరిష్కరించాలని రాయలసీమ సాగు నీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి కోరారు . రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన రాయలసీమకు సాగునీరు, త్రాగునీరు, నిధులు, వనరులు సమకూర్చేలా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి  విజ్ఞప్తి చేసారు.నంద్యాల రాయలసీమ సాగునీటి సాధన సమితి కార్యాలయంలో శనివారం నాడు పత్రికా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బొజ్జా దశరథరామిరెడ్డి  మాట్లాడుతూ అన్ని రంగాలలో వెనుకబడ్డ రాయలసీమ సమస్యలపై ముఖ్యమంత్రి  ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ . రాజశేఖరరెడ్డి  చేపట్టిన దుమ్ముగూడెం- నాగార్జున సాగర్ టేల్ పాండ్ ప్రాజెక్టు నిర్మించి శ్రీశైలం జలాశయం లోని నీరుమొత్తం రాయలసీమ కు కేటాయించాలని డిమాండ్ చేసారు.  


మీరైన మా సమస్యలను పరిష్కారం చేయండి 

పట్టిసీమ ద్వారా ఆదా అయిన  కృష్ణా నికర జలాలను రాయలసీమ కు చట్టబద్దంగా కేటాయిస్తానని చంద్రబాబు నాయుడు  అసెంబ్లీ సాక్షిగా మార్చి 30, 2016 న ప్రకటించారు. కానీ ఆ దిసగా  కార్యాచరణ జరగలేదు.  30 తారీఖున ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈ నీటిని రాయలసీమ కు చట్టబద్దంగా చేయాలని రాయలసీమ రైతాంగం కోరుతున్నారని తెలిపారు. సిద్దేశ్వరం అలుగు నిర్మాణానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైయస్ . రాజశేఖరరెడ్డి  110 కోట్లతో మంజూరు చేసి. మహబూబ్‌నగర్ జిల్లా లోని సోమశిల వద్ద శంఖుస్థాపన చేసారని బొజ్జా దశరథరామిరెడ్డి  గుర్తు చేసారు. తెలంగాణ లోని మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు రాయలసీమ లోని నాలుగు జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు పుష్కలంగా సాగు, త్రాగునీరు అందించేందుకు సిద్దేశ్వరం అలుగు నిర్మాణం దోహదం చేస్తుందన్నారు. ప్రభుత్వానికి రాయలసీమ కష్టాలు గుర్తు చేసేందుకు, తండ్రి ఆశయాలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  తీర్చాలని కోరుతూ. ఈ నెల 28 నుంచి రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆద్వర్యంలో ప్రజా సంఘాల ఐక్యవేదిక సారథ్యంలో సిద్దేశ్వర ప్రజా పాదయాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. పార్టీలకు అతీతంగా రైతులు సిద్దేశ్వరం అలుగు సాధన ప్రజాపాదయాత్ర లో వేలాదిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ పాదయాత్రకు సంఘీభావంగా ఈ నెల 28 న ఉదయం 8-00 గంటలకు నంద్యాల టౌన్ హాల్ వద్దకు జాతీయ రైతు సంఘాల సమాఖ్య కేంద్ర నాయకులు , పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్డాల రైతు సంఘాల ప్రతినిధులు హాజరవుతున్నట్లు బొజ్జా దశరథరామిరెడ్డి  తెలిపారు .సమావేశంలో  రాయలసీమ సాగునీటి సాధన సమితి కన్వీనర్ యేర్వ రామచంద్రారెడ్డి, సోషల్ మీడియా ప్రతినిధి రామకృష్ణా రెడ్డి, మహేశ్వర రెడ్డి, రమణారెడ్డి, శ్రీనివాస రెడ్డి, సుధాకర్ రావు, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post