ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి
ఎమ్మిగనూరు మే 25 (way2newstv.com)
వై.ఎస్.ఆర్.సి.పి పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా తన తండ్రి ఎర్రకోట చెన్నకేశవరెడ్డిని మునుపెన్నడూ లేనివిధంగా అఖండ మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు అంటూ ఎర్రకోట చెన్నకేశవరెడ్డి తనయుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి అన్నారు.స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అన్నారు.
ప్రతి ఓటర్ మహశయులకు కృతజ్ఞతలు..
ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ ప్రభంజనానికి సైకిల్ తుక్కయిపోయిందని, ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని ఓటర్ మహశయులకు మరియు అధికారులకు, నాయకులకు, కార్యకర్తలకు, ప్రింట్ మిడియా, ఎలక్ట్రానిక్ మిడియా మిత్రులందరికి పేరు పేరున కృతజ్ఞతలు అని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.తన తండ్రి వరుసగా నాలుగు సార్లు గెలవడం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఈకార్యక్రమంలో పాల శ్రీనివాస్ రెడ్డి, హజీ వహబ్, వాహిద్, అల్ ప్రైడ్ రాజు, సయ్యద్ చాంద్, నజీర్ ఆహ్మద్, మహబూబ్ బేగ్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.