ఏపీలో భారీగా సర్వీసు ఓట్లు


విజయవాడ, మే 22, (way2newstv.com)
ఎన్నికల కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారి ద్వివేది స్పష్టం చేశారు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ, ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తామని అన్నారు. ముందు పోస్టల్ బ్యాలెట్స్, సర్వీస్ ఓట్ల లెక్కింపు ఉంటుందని చెప్పారు. అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాలకు వేర్వేరుగా లాటరీలు తీసి వీవీప్యాట్ స్లిప్స్ లెక్కిస్తామని అన్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటల వరకూ తొలి ఫలితం రావచ్చని అభిప్రాయపడ్డారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఓ అబ్జర్వర్ ఉంటారని, కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు.రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ఎన్నికల్లో సర్వీస్‌, పోస్టల్‌ బ్యాలెట్లు ఓట్లు భారీగా పోలైనట్లు ఎన్నికల అధికారి వెల్లడించారు. పోస్టల్‌ బ్యాలెట్లతో పోలిస్తే సర్వీస్‌ ఓట్లు గణనీయంగా తగ్గాయి. గురువారం ఉదయం ఏడులోగా కౌంటింగ్ సెంటర్‌కు చేరే  సర్వీస్‌ ఓట్లు, పోస్టల్‌ బ్యాలెట్లు చెల్లుబాటు అవుతాయని అధికారులు తెలిపారు. కాగా  కౌటింగ్‌ నేపథ్యంలో ఇప్పటివరకు పోలైన సర్వీస్‌ ఓట్ల వివరాలను ఎన్నికల అధికారులు వెల్లడించారు.

ఏపీలో భారీగా సర్వీసు ఓట్లు
శ్రీకాకుళం 8121

విజయనగరం 2564
విశాఖపట్నం 3333
తూర్పు గోదావరి 923
కృష్ణా 457
గుంటూరు 3036
ప్రకాశం 3765
నెల్లూరు 362
కడప 1175
కర్నూలు 1935
అనంతపురం 1676
చిత్తూరు 2185
25 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో పోలైన సర్వీస్‌ ఓట్లు 28, 662,175
అసెంబ్లీలకు పోలైన మొత్తం సర్వీస్ ఓట్లు 29,532,25. 
పార్లమెంటు నియోజక వర్గాల్లో వచ్చిన ఫారం 12 దరఖాస్తులు 3,17,291
లోక్‌సభ నియోజక వర్గాల పరిధిలో జారీ చేసిన ఓట్లు 3,00,957
 ఇప్పటి వరకు లోక్‌సభ నియోజక వర్గాల పరిధిలో ఆర్వోలకు అందిన పోస్టల్‌ బ్యాలెట్లు 2,14,937
13 జిల్లాల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నది 3,18,530
మంజూరు చేసింది 3,05,040
 మే 20 నాటికి ఆర్వోలకు చేరిన పోస్టల్ బ్యాలెట్లు 2,11,623
Previous Post Next Post