ఫలితాల వెల్లడిలో రిటర్నింగ్ అధికారులదే తుది నిర్ణయం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఫలితాల వెల్లడిలో రిటర్నింగ్ అధికారులదే తుది నిర్ణయం


హైదరాబాద్ మే 22 (way2newstv.com
ఫలితాల వెల్లడిలో రిటర్నింగ్ అధికారులదే తుది నిర్ణయమని.. ఈసీ జోక్యం చేసుకోదని సీఈవో రజత్ కుమార్ తెలిపారు. ఓట్ల లెక్కింపు నిర్వహణపై రజత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తం పారదర్శకంగా ఉంటుందన్నారు. రేపు ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం. 17 లోక్‌సభ స్థానాల పరిధిలో మొత్తం 443 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రాష్ట్రంలోని 35 ప్రాంతాల్లో 126 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

ఫలితాల వెల్లడిలో రిటర్నింగ్ అధికారులదే తుది నిర్ణయం

హైదరాబాద్‌లో 7, సికింద్రాబాద్‌లో 6 సెగ్మెంట్లలో లెక్కింపు ఉంటుందన్నారు. ఈటీపీబీఎస్, పోస్టల్ బ్యాలెట్ల తర్వాత ఈవీఎంల లెక్కింపు ప్రారంభమౌతుందన్నారు. ప్రతి లెక్కింపు కేంద్రంలో 14 టేబుళ్లు ఉంటాయన్నారు. నిజామాబాద్ పరిధిలో ప్రతి అసెంబ్లీ స్థానంలో 2 హాళ్లు, 36 టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో లాటరీ పద్దతిలో 5 వీవీప్యాట్ల ఎంపిక జరుగుతుందన్నారు. వీవీప్యాట్ స్లిప్పులు, ఈవీఎంలకు ఇప్పటివరకు తేడా రాలేదన్నారు. ఈవీఎంలు, 17సీలో సమానంగా వచ్చి వీవీప్యాట్ స్లిప్పులో తేడా వస్తే మరోసారి స్లిప్పుల లెక్కింపు చేపడతారన్నారు. వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపులో మానవ తప్పిదం జరగవచ్చునని.. కావున రెండు, మూడుసార్లు వీవీప్యాట్ స్లిప్పులు లెక్కిస్తామన్నారు. రీకౌంటింగ్ కోసం అభ్యర్థి లేదా ఏజెంట్ ఆర్వోకు లిఖిత పూర్వక దరఖాస్తు చేయాలన్నారు. ఫలితాల వెల్లడిలో రిటర్నింగ్ అధికారులదే తుది నిర్ణయమని ఆ విషయంలో ఈసీ జోక్యం చేసుకోదని పేర్కొన్నారు.