రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంది - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంది


హైదరాబాద్, మే 21 ,(way2newstv.com)
 తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.రామకృష్ణారావు మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఉద్యోగులకు వేతనాలు, ఆసరా పెన్షన్లు, ప్రాజెక్టుల బిల్లులు, సంక్షేమ పథకాలకు నిధులను సకాలంలోనే చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతేడాది అధిక ఆర్థిక వృద్ధి నమోదైంది. ఆర్థిక వృద్ధిరేటు నమోదులో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. స్టేట్ ఓన్ ట్యాక్స్లోనూ తెలంగాణ నంబర్ వన్ గా నిలిచింది. రాష్ట్రం వృద్ధిరేటు 14శాతం కంటే తక్కువ ఉంటే, కేంద్రం జీఎస్టీ మినహాయింపు ఇస్తుంది. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న బిల్లులు కేవలం రూ.3474కోట్లు మాత్రమే ఉన్నాయన్నారు.  



రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంది 


కేంద్ర గణాంకాల సంస్థ లెక్కల ప్రకారం 2018-19 రాష్ట్ర జీఎస్డీపీ రూ.8లక్షల 65వేల 875 కోట్లుగా ఉంది. 2018-19లో రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు 15శాతం. ఐదేళ్లలో తెలంగాణ కాపిటల్ ఎక్స్పెండిచర్ లక్షా 64వేల 519 కోట్లు.ప్రతి 15రోజులకోసారి బిల్లులు పే చేస్తుంటాం. నెలకు సుమారు 2వేల కోట్ల వరకు బిల్లులు పేమెంట్ చేస్తుంటాం. మిషన్భగీరథ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.46,960కోట్లు. ఇప్పటివరకు ప్రాజెక్టుపై ఖర్చు చేసింది రూ.27,509కోట్లు.
మిషన్భగీరథలో పెండింగ్ బిల్లులు రూ.659కోట్లు మాత్రమే.ప్రభుత్వ పథకాలకు నిధుల కొరత లేదు. పెన్షన్లకు అవసరమైన నిధులు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. రైతుబంధు కోసం రబీ సీజన్లో 5200 కోట్లు విడుదల చేశాం. పెట్టుబడులు పెరుగుతున్న కొద్దీ ఆర్థిక వృద్ధిరేటు పెరుగుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. ఆదాయం పెరిగే కొద్దీ ఖర్చులు కూడా పెరుగుతాయి. రైతుబంధు పథకం నిధులు రైతులకు ఆన్లైన్లో చెల్లిస్తాం. రైతుకు ఇబ్బంది లేకుండా రుణమాఫీని అమలు చేస్తాం. మే నెలాఖరు నుంచి జూన్ మొదటి వారం వరకు రైతుబంధు సాయం పంపిణీ చేస్తాం. పెన్షన్లకు అవసరమైన నిధులు ప్రభుత్వం దగ్గర ఉన్నాయని స్పష్టం చేశారు.