జగిత్యాలలో రాజీవ్ వర్ధంతి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జగిత్యాలలో రాజీవ్ వర్ధంతి

జగిత్యాల, మే 21 ,(way2newstv.com)

జగిత్యాల పట్టణం లో మంగళవారం దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 28 వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటి నుండి ధర్మపురి ప్రధాన రహదారిలో వున్న రాజీవ్ గాంధీ విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాజీవ్ గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాలులు అర్పించారు. ఈ సందర్భంగా రాజివ్ గాంధీ ఆత్మశాంతి కోసం రెండు నిముషాల పాటు మౌనం వహించారు. 




జగిత్యాలలో రాజీవ్ వర్ధంతి


ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ శ్రేణులు మాట్లాడుతూ 1984 నుండి 1989 వరకు భారతదేశ ప్రధానిగా అతి చిన్న వయసులోనే ప్రధానిగా బాధ్యతలు చేపట్టి దేశానికి అద్భుతమైన సేవ లందించిన మహనీయులు రాజీవ్ గాంధీ అని కొని యడారు. దేశంకోసం తన ప్రాణాన్ని తృణ ప్రాయంగా అర్పించిన మహనీయులు రాజీవ్ గాంధీ అన్నారు. తన మరణానికి మూడు రోజుల ముందు జగిత్యాల పట్టణం లో పర్యటించారు అని గుర్తు చేశారు. తమిళ నాడులో దురదృష్టవశాత్తు వశాత్తు హత్యకు గురికావడం చాలా దురదృష్టకరం అన్నారు. దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన గొప్ప చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. 18 సంవత్సరాలు వయస్సు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కలిగించిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కుతుంది అన్నారు. టెక్నాలజీ రంగాన్ని ముందుకు నడిపించిన ఘనత కూడా రాజీవ్ గాంధీకి దక్కుతుంది అన్నారు.