విద్యుత్ బిల్లు బకాయిపడ్డ టీడీపీ నేతలు


విజయవాడ మే 20 (way2newstv.com)  
విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులోని పాత కృష్ణా జిల్లా టిడిపి కార్యాలయం ఖాళీ చేసి కరెంట్ బిల్లు కుడా చెల్లించకుండా పార్తీ నేతలు వెళ్లిపోవడంతో ఇంటి యజమాని మండిపడుతున్నారు. రెండు నెలలుగా వెంటబడుతున్నా నేతలు  సమాధానం చెప్పడంలేదని ఇంటి యజమాని, ఎన్నారై పొట్లూరి శ్రీధర్ ఆరోపించారు. 2009లో స్థలం టిడిపి జిల్లా కార్యాలయానికి అయన లీజుకిచ్చారు. లీజు విషయంలో కూడా లక్షలాది రూపాయలు పెండింగ్ పెట్టి చివరకు నగరానికి చెందిన ఇద్దరు పారిశ్రామికవేత్తలతో సెటిల్ చేయించుకున్నారని అయన అన్నారు. 



విద్యుత్ బిల్లు బకాయిపడ్డ టీడీపీ నేతలు

విద్యుత్ బిల్లు లక్షల రూపాయల బకాయిలు ఉంటే విద్యుత్ శాఖ అధికారులు ఇప్పటివరకు ఎందుకు ఊరుకున్నారో తనకు అర్థం కావడం లేదని అయన ఆవేదన వ్యక్తం చేసారు. అధికార పార్టీ నేతలు ఇన్ని సంవత్సరాలు విద్యుత్ బిల్లులు కట్టకుండా బాధ్యతారాహిత్యంగా ఉండటం సమంజసంగా లేదని అయన అన్నారు. సాధారణ పౌరులు పది రోజులు లేట్ అయితే ఫీజులు పీక్కు పోయే విద్యుత్ అధికారులు ఈ కార్యాలయానికి ఇన్ని రోజులు  విద్యుత్ సరఫరా ఎలా చేశారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన విధంగా భావించి ఇప్పుడు ముందుకొచ్చాను. ఇప్పటికైనా టిడిపి నేతలు తన ఇంటి బకాయి విద్యుత్ బిల్లులు చెల్లించాలని శ్రీధర్ డిమాండ్ చేసారు. ఈ విషయంలో  వెనక్కి తగ్గేది లేదు ఎటువంటి పోరాటానికైనా సిద్ధమని అయన అన్నారు. 
Previous Post Next Post