పౌరహక్కుల నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పౌరహక్కుల నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

విడుదల చేయాలని ప్రజాసంఘాల డిమాండ్
సిద్దిపేట, మే 14 (way2newstv.com)
సిద్దిపేట జిల్లా మల్లన్న సాగర్లో భూములను కోల్పోయిన భూ నిర్వాసితుల కోసం మద్దతుగా న్యాయం చేయాలని వెళ్లిన పౌర హక్కుల సంఘం అధ్యక్షులు ప్రోపెసర్ గడ్డం లక్ష్మన్,ప్రధాన కార్యదర్శి నారాయణ రావు,ఇస్మాయిల్,పురుషోత్తం, ఆర్ భూపతి, శ్రీనివాస్ లను సిద్దిపేట జిల్లా తొగుటలో అరెస్ట్ చేసి దౌల్తాబాద్  పీస్ కి తరలించారు, వారిని వెంటనే విడుదల చేయాలని ప్రజా సంఘాల డిమాండ్ చేశాయి. 


పౌరహక్కుల నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

కాగా మల్లన్నసాగర్ ముంపు ప్రాంత బాధితుల నుండి వాస్తవ విషయ సేకరణకు వెళ్లిన సిఎల్ సి నాయకులు నారాయణ్ రావు, రఘునాథ్, ఇస్మాయిల్ తదితరులను దౌల్తాబాద్ పోలీసులుఅక్రమంగానిర్బంధించడాన్నిఖండించాలని ప్రజలు,ప్రజాస్వామిక వాదులకు ప్రజాసంఘాలు విజ్ఞప్తి చేశాయి.  అరెస్టయిన వారందరినీ భేషరుతుగా వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర కమిటీ, తెలంగాణ ప్రజాఫ్రంట్ డిమాండ్ చేసింది.మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసిత రైతులను , కూలీలను పరమార్శించి తిరిగి వస్తున్న, పౌరహక్కుల సంఘం నాయకులను అరెస్టు చేయడాన్ని  తీవ్రంగా ఖండిస్తున్నామని పౌరహక్కుల ప్రజాసంఘం  తెలంగాణ రాష్ట్రం ప్రధాన కార్యదర్శి జయవింధ్యాల తెలిపారు.వారిని వెంటనే  విడుదల చేయాలని డిమాండ్ చేశారు.