పదవ తరగతి పరీక్షలలో 99% ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పదవ తరగతి పరీక్షలలో 99% ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు

ఎంఈఓ రమా వెంకటేశ్వర్లు
 ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు
 నోవీ కాన్సెప్ట్ స్కూల్ నుండి ముగ్గురు విద్యార్థులకు 10.0
తుగ్గలి మే 14 (way2newstv.com):
తుగ్గలి మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలలో ఈ సంవత్సరం పదవ తరగతి పరీక్షలలో 99% ఉత్తీర్ణత సాధించినట్లు మండల విద్యాధికారి రమా వెంకటేశ్వర్లు తెలిపారు.మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 507  మంది విద్యార్థులు పదవతరగతి పరీక్షలు రాయగా 499 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన తెలిపారు.తుగ్గలి జెడ్పీ పాఠశాలలో 70 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 70 మంది ఉత్తీర్ణత సాధించినట్లు వీరిలో మంజుల 9.0 గ్రేడు,సుదర్శనం 8.7 గ్రేడ్ సాధించారని,పెండేకల్ జెడ్పీ పాఠశాలలో 133 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 130 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని,


పదవ తరగతి పరీక్షలలో 99% ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు

వీరిలో అంజలి9.5 గ్రేడు,పులి శేఖర్ 9.2 గ్రేడు సాధించారని,ఎద్దుల దొడ్డి జెడ్పీ పాఠశాలలో 27 మందికి గాను 27 మంది ఉత్తీర్ణత సాధించారు వీరిలో రంగ నాథ 9.3,వెంకటేశ్వర్లు 9.3 గ్రేడ్ సాధించారని,రామలింగాయ పల్లే జెడ్పీ పాఠశాలలో 25 మందికి గాను 25 మంది ఉత్తీర్ణత సాధించారని,వీరిలో వెంకటేష్ 9.3, అరవింద్ 9 గ్రేడ్ సాధించారని,పగిడిరాయి జెడ్పీ పాఠశాలలో 23 మందికి గాను 21 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని,వీరిలో నంది కిరణ్ 8.3,నరేంద్ర 8.2 గ్రేడ్ సాధించారని, జొన్నగిరి  జెడ్పీ పాఠశాలలో145  మందికి గాను 143 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని, వీరిలో స్వరూప 9.3,తేజేశ్వర్ 9 గ్రేడ్ సాధించారని,రాతన ఆశ్రమ పాఠశాలలో ఐదు మందికి గాను ఐదు మంది ఉత్తీర్ణత సాధించారని, వీరిలో అరుణ 8.7,భాగ్యలక్ష్మి 8.5 గ్రేడ్ సాధించారని,కేజీబీవీ పాఠశాలలో 39 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 38 మంది ఉత్తీర్ణత సాధించారని,వీరిలో శ్రీ వాణి, ఈశ్వరమ్మ,మహేశ్వరి,పూజిత లు 9.3 గ్రేడ్ సాధించారని,రాతన జెడ్పీ పాఠశాలలో 12 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 12 మంది ఉత్తీర్ణత సాధించారని,వీరిలో అశ్విని 9, శ్రావణి 8.8 గ్రేడ్ సాధించారని,అలాగే  తుగ్గలిలోని  నోవి కాన్సెప్ట్ స్కూల్ నందు 21 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 21 మంది ఉత్తీర్ణత సాధించారని,వీరిలో సునీల్ కుమార్, ఉమాదేవి,పూజిత 10 గ్రేడ్ సాధించారని ఎంఈవో రమా వెంకటేశ్వర్లు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్,జాకీర్ హుస్సేన్,బాబర్,నారాయణ, కస్తూరి భా పాఠశాల ప్రత్యేక అధికారి అబీదా బేగం తదితరులు పాల్గొన్నారు.