గ్రేటర్ కార్పొరేషన్ లో అధికారులపై పని ఒత్తిడి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గ్రేటర్ కార్పొరేషన్ లో అధికారులపై పని ఒత్తిడి

హైద్రాబాద్, మే 8(way2newstv.com)
జిహెచ్‌ఎంసి లో ర్పడిన ఖాళీల భర్తీకి ఎట్టకేలకు గ్రహణం వీడింది. గడిచిన కొద్ది సంవత్సరాలుగా ముఖ్యమైన విభాగాల్లో నెలకు పదుల సంఖ్యలో ఉద్యోగులు పదవీ విరమణ పొందుతున్నా, వారి స్థానంలో ప్రత్యామ్నాయంగా భర్తీల్లేవు. చీఫ్ సిటీ ప్లానర్ మొదలుకుని సర్వేయర్ వరకు మొత్తం 412 మంది అధికారులు,సిబ్బంది విధులు నిర్వర్తించాల్సి ఉండగా, కేవలం 135 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. దీనికి తోడు ప్రతి నెల ఉద్యోగులు పదవీ విరమణలు పొందుతున్నారు.ఒక రకంగా ఔట్‌సోర్సు, కాంట్రాక్టు ఉద్యోగులను అవసరానికి తగిన విధంగా నియమించుకుంటున్నా, పూర్తి స్థాయిలో అవసరాలకు తీరక, పనిభారం పెరుగుతోంది. ఈ క్రమంలో ఎన్నో సంవత్సరాల నుంచి టౌన్‌ప్లానింగ్ విభాగంలో 200 సూపర్‌వైజర్లు, టౌన్‌ప్లానింగ్ అసిస్టెంటు పోస్టులు హారం అంచనా, నాలాల వెడల్పు వంటి పనుల విషయంలో జాప్యం ఏర్పడేది. కానీ కొద్దిరోజుల క్రితం ఈ ఖాళీఖాళీగా ఉండటంతో క్షేత్ర స్థాయిలో చేపట్టాల్సిన అక్రమ నిర్మాణాల కూల్చివేత, రోడ్డు విస్తరణ పనులు, నష్టపరిలను భర్తీ చేసుకునేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆమోదం తెలపటంతో ఈ విభాగానికి త్వరలోనే కావల్సిన స్థాయిలో సిబ్బంది సమకూరనుంది. 


గ్రేటర్ కార్పొరేషన్ లో అధికారులపై పని ఒత్తిడి

దీంతో పాటు గ్రేటర్ బల్దియా గడిచిన 11 సంవత్సరాల్లో గ్రేటర్‌గా రూపాంతరం చెందటంతో పాటు ఆ తర్వాత 18కు, ఆ తర్వాత 24 సర్కిళ్ల నుంచి ఇటీవలే 30 సర్కిళ్లకు పెరిగింది. దీనికి తోడు నగరంలో ఆహార విక్రయ కేంద్రాలు కూడా నిబంధనలకు విరుద్దంగా రోడ్డుకిరువైపులా, ఫుట్‌పాత్‌లపై ఇష్టారాజ్యంగా వెలుస్తున్నాయి. కానీ వ్యాపార సంస్థలు విక్రయిస్తున్న ఆహారంలో నాణ్యత ఎంతవరకు ఉంది? అన్న విషయాన్ని తనిఖీ చేసేందుకు కావల్సిన స్థాయిలో ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు అందుబాటులో లేరు. కొద్దిరోజుల క్రితం వరకు నలుగురు ఫుడ్ ఇన్‌స్పెక్టర్లున్నా, వారిలో ముగ్గుర్ని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లుగా పదోన్నతులు కల్పించటంతో ప్రస్తుతం ఒకే ఒక్క ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అందుబాటులో ఉన్నారు. ఫలితంగా నగరంలో నాణ్యత లేని, కల్తీ ఆహార విక్రయాలను జిహెచ్‌ఎంసి ఆశించిన స్థాయిలో నియంత్రించలేకపోతుంది. ఈ క్రమంలో నగరం గ్రేటర్‌గా రూపాంతరం చెందిన తర్వాత సర్కిల్‌కు ఒకరు చొప్పున ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు కావాలని పాలక మండలి తీర్మానం కూడా చేసి పంపింది. మరో వైపు పనులంటనే బాబోయ్ అంటూ కాంట్రాక్టర్లు పరుగులెత్తటంతో రోడ్ల నిర్మాణం, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలకు సైతం కాంట్రాక్టర్ల కొరత ఏర్పడింది. ఈ సమస్యను అధిగమించేందుకు జీహెచ్‌ఎంసీ చర్యలు చేపట్టింది. కాంట్రాక్టర్లలో కొందరు పనులు ప్రారంభించిన తర్వాత మధ్యలో వదిలేసి వెళ్లటం, మరికొందరు టెండర్ల ప్రక్రియలో కూడా పాల్గొనకపోటంతో కొన్ని పనులకు నాలుగైదు సార్లు కూడా టెండర్లను ఆహ్వానించిన సందర్భాలున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో సుమారు రూ. 710 కోట్ల వ్యయంతో 624 రోడ్డు నిర్మాణ పనులను చేపట్టాలని ఇటీవలే నిర్వహించిన టాస్క్ఫోర్సు సమావేశం నిర్ణయించిన సంగతి తెలిసిందే! అయితే రోడ్డు నిర్మాణ పనులు పారదర్శకంగా, జరగటంతో పాటు సకాలంలో పూర్తి చేసేందుకు గతంలో ఎదురైన ఇబ్బందులను అధిగమించేందుకు అధికారులు కాస్త ముందుచూపుతో వ్యవహరిస్తున్నారు. రోడ్డు నిర్మాణ పనులకు ప్రత్యేక టాస్క్ఫోర్సును నియమించిన తర్వాత ఇలాంటి లోపాలు పునరావృతం కారాదంటూ మంత్రి కె. తారకరామారావు ఆదేశాల మేరకు అధికారులు కాంట్రాక్టర్లకు పనులను అప్పగించే విషయంలో ఆచితూచి వ్వవహరిస్తున్నారు. జీహెచ్‌ఎంసీకి ప్రస్తుతం అందుబాటులో ఉన్న కాంట్రాక్టర్లు నెలకు రూ. 168 కోట్ల విలువైన రోడ్డు నిర్మాణ పనులు మాత్రమే చేపట్టే సామర్ధ్యం ఉన్నట్లు గుర్తించారు. అయితే వీరిలో కొందరు కనిష్టంగా రూ. ఐదు కోట్లు, గరిష్టంగా రూ. 20 కోట్ల వరకు పనులు చేసేవారున్నారు. ఇప్పటి వరకు రోడ్ల నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు జీహెచ్‌ఎంసీ ఇంజనీర్లు నేరుగా సంప్రదింపులు జరుపుతూ పనులు చేపట్టేందుకు తమ సామర్థ్యాన్ని తెలుసుకుంటున్నారు. కాంట్రాక్టర్ల నుంచి లిఖితపూర్వకమైన పత్రాలను కూడా రాయించుకుంటున్నట్లు సమాచారం. కాంట్రాక్టర్ల సామర్థ్యానికి తగిన విధంగా పనులను అప్పగిస్తే పనులు సక్రమంగా జరగటంతో పాటు సకాలంలో పూర్తవుతాయని వారు భావిస్తున్నారు. మొత్తం రూ. 710 కోట్ల వ్యయంతో చేపట్టదల్చుకున్న 625 రోడ్ల నిర్మాణ పనుల్లో రూ. 280 కోట్ల వ్యయంతో 314 బిటీ రోడ్లు, రూ. 260 కోట్ల వ్యయంతో 258 సీసీ రోడ్లు, రూ. 40 కోట్ల వ్యయంతో వైట్‌టాపింగ్ రోడ్లను నిర్మించాలని నిర్ణయించారు. రూ. 28 కోట్ల వ్యయంతో లేన్ మార్కింగ్, రేడియం లైటింగ్ తదితర పనులను చేపట్టేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. వచ్చే మార్చి నెలాఖరులోపు ఈ 625 రోడ్ల నిర్మాణ పనులన్నీ పూర్తి చేయాలన్న లక్ష్యంతో జీహెచ్‌ఎంసీ ముందుకెళ్తోంది