మైనర్ బాలికపై ఐదు నెలలుగా ఆత్యాచారం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మైనర్ బాలికపై ఐదు నెలలుగా ఆత్యాచారం

సూర్యాపేట, మే 13, (way2newstv.com)
:సూర్యాపేట జిల్లాలో ఓ దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది. పెన్ పహాడ్ మండలం నాగుల పహాడ్ లో మైనర్ బాలిక (14) పై కన్నేసిన కామాందుడు కూల్ డ్రింక్ లో  నిద్ర మాత్రలు కలిపి బాలిక పై ఐదు నెలలు గా అత్యాచారానికి పాల్పడ్డాడు.బాలిక గర్భం దాల్చడంతో శీలానికి వెలకట్టి  ఐదు వేలు ఇస్తాను అబార్షన్ చేయించుకోమన్నాడు. బాలిక తండ్రి మరణంతో ఈ దుర్ఘటన వెలుగులోకొచ్చింది. వివరల్లోకెళితే సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం నాగుల పహాడ్ లో తెరపంగి ఆలెందర్ ఆరు నెలల క్రితం పక్కింటి మైనర్ బాలిక (14) పై కన్నేశాడు. 


మైనర్ బాలికపై ఐదు నెలలుగా ఆత్యాచారం

బతుకు దెరువు కోసం బాలిక తల్లి ఆంధ్ర ప్రదేశ్ కు వలస పోగా తన తండ్రి తో కలిసి కూతురు ఇంటి వద్దే ఉంటూ కూలి పనులకు వెళ్తుంది.అదే అదునుగా భావించిన కామాందుడు కూల్ డ్రింక్ లో  నిద్ర మాత్రలు కలిపి, బెదిరించి పలు మార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అప్పటినుండి బాలిక ను బెదిరించి ఈ అఘాయిత్యానికి పాల్పడుతూనే ఉన్నాడు. పదిహేను రోజుల క్రితం బాలిక తండ్రి మరణించడంతో తల్లి స్వస్ధలానికి తిరిగి వచ్చింది. అనారోగ్యానికి గురైన బాలికను వైద్యులకు చూపించడంతో గర్భవతి అని తేల్చారు. ఖంగు తిన్న బాలిక తల్లి గ్రామంలోని పెద్దమనుషులను ఆశ్రయించడంతో శీలానికి వెలకట్టిన గ్రామస్థులు నిందితుని తరుపున బేరాలకు దిగారు. ఐదు వేలు తీసుకుని అబార్షన్ చేయించుకోమని ఉచిత సలహా ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన మహిళా సంఘాలు నిందితునిపై కేసు నమోదు చేయించి బాలిక తర పున న్యాయ పోరాటం చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పెన్ పహాడ్ పోలీసులు పరారీ లో ఉన్న నిందితుని కోసం గాలిస్తున్నారు.