పాలక మండలి ఛైర్ పర్సన్ మనోరమ
కౌతాళం మే 13, (way2newstv.com)
కౌతాళం మండల పరిధిలోని ఊరుకుంద గ్రామంలో వెలసిన పుణ్య క్షేత్రము శ్రీ నరసింహ స్వామి పుణ్య క్షేత్రము ఈ నెల 16 నుండి 18 వరకు శ్రీ నరసింహా ఈరన్న స్వామి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు పాలక మండలి ఛైర్మన్ మనోరమ, సహాయ కమిషనర్, కార్యానిర్వహణాధి కారిణి కె.వాణి లు క ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆగమశాస్ర ప్రకారం వేదపండితులు, అర్చకులచే అత్యంత వైభవంగా స్వామి వారికి విశేష పూజ కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. వెండి కవచ సంప్రోక్షణ, శ్రీ మహాసుదర్శన హోమం తదితర ఇత్యాది పూజ కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.
ఈరన్న స్వామి జయంతి వేడుకలకు రండి
ఈ నెల 16న ఉదయం 5నుండి 7వరకు సుప్రభాత సేవ,బిందె సేవ, వేదపఠనం తదుపరి ఉదయం 9నుండి స్వామివారి ఏకశిలా మూలవారుల వెండికవచమునకు సంప్రోక్షణ, అష్టోత్తర కలశ క్షీరాభిషేకం, సహస్రనామర్చన,మహా మంగళ హారతి, తీర్థ వినియోగం, రాత్రి 9నుండి శ్రీ అశ్వత్థ నారాయణ భజన మండలి,అంభాభావని దేవస్థాన శ్రీ రుక్మిణీ పాండురంగ భజన మండలి కార్యాక్రమాలు జరుగుతాయన్నారు.17న శ్రీ నృసింహా స్వామి జయంతి సందర్భంగా ఉదయం 5 నుండి 8వరకు బిందె సేవ, సుప్రభాత సేవ,వేదపఠనం ఆతర్వాత గణపతి పూజ,పుణ్యావాచనము,ప్రధాన కలశ స్థాపన,మహా సుదర్శన్ హోమం,మంగళ హారతి, తీర్థ ప్రసాద వినియోగం, అన్న ప్రసాడవితరణ జరుగుతుందన్నారు. రాత్రి 8 నుండి శ్రీ ఉరుకుంద భజన మండలిచే భజన కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు.18న ఉదయం 5నుండి సుప్రభాత సేవ,వేదపారాయణం,మహాభిషేకం,ప్రత్ యేక పూజలతోపాటు మహామంగళహారతి,తీర్థ ప్రసాదాలు ఉంటాయన్నారు.శ్రీ సుదర్శన హోమం నందు పాల్గొనదలిచినవారు రూ..250లు దేవస్థాన కార్యాలయంలో చెల్లించాల్సివుంటుందని, ఇందుకోసం ఈ13లోపు తమ పేర్లను నమోదుచేసుకోవాలని వారు కోరారు. శ్రీనరసింహా ఈ రన్న స్వామి దేవస్థానం నందు నాలుగు రాజగోపురాల నిర్మాణం కొరకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని,దేవాలయ అభివృద్ధి దృష్ట్యా భక్తాదులు విరివిగా విరాళాలు ఇచ్చి స్వామి వారి కృపకు కాగలరని వారు విన్నవించారు. రూ లక్ష ఆపైన చెల్లించిన దాతల పేర్లను రాజగోపురాల శిలాఫలకంపై నమోదుచేయడం జరుగుతుందన్నారు.ఈ విశేష కార్యక్రమంలో భక్తమహాశయులు,ఉరుకుంద గ్రామ ప్రజలు,విరివిగా పాల్గోనాలని వారు కోరారు.