సంపూర్ణ ప్రజా తీర్పుతోనే రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు


ఊహించని మెజారిటీతో రాష్ట్రంలో వైయస్సార్సీపి ప్రభుత్వం ఏర్పాటు.
ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు.
 సంబరాల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలు.
తుగ్గలి మే 23   (way2newstv.com
సంపూర్ణ ప్రజా తీర్పుతోనే నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి, మొదటిసారిగా ప్రభుత్వంను ఏర్పాటు చేస్తుందని ఉప్పరపల్లె సింగిల్ విండో ప్రెసిడెంట్ ప్రహల్లాద రెడ్డి,మాజీ జెడ్పిటిసి పగిడిరాయి జగన్నాథరెడ్డి మరియు మండల కన్వీనర్ జిట్టా నాగేష్ లు తెలియజేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలు ఊహించని మెజారిటీని వైఎస్ఆర్ ప్రభుత్వానికి అందించారని వారు తెలియజేశారు.పత్తికొండ వైసిపి అభ్యర్థి కంగాటి శ్రీదేవిని అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు.


 సంపూర్ణ ప్రజా తీర్పుతోనే రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు
టిడిపి ప్రభుత్వం అరాచక పాలనను సహించలేక ప్రజలు వైఎస్ఆర్ ప్రభుత్వానికి అఖండ మెజారిటీను ఇచ్చారని తెలియజేసారు.ఈ నెల 30న తిరుపతిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని వారు తెలియజేశారు.వైఎస్సార్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలను మరియు ఇచ్చిన హామీలను తప్పకుండా జగన్మోహన్ రెడ్డి నెరవేరుస్తారని వారు తెలియజేశారు.అనంతరం వైయస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.తుగ్గలి మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో వైఎస్ఆర్సిపి నాయకులు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో యువ నాయకులు తుగ్గలి మోహన్ రెడ్డి,హయ్యద్ బాషా మరియు వైఎస్ఆర్సిపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Previous Post Next Post