హైదరాబాద్, మే 23 (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలపై సినీనటుడు, వైకాపా నేత మంచు మోహన్ బాబు స్పందించారు. ప్రజల తీర్పు ఎప్పుడూ గొప్పగానే ఉంటుందని వ్యాఖ్యానించారు. రాజశేఖర్ రెడ్డి తన కుమారుడికి ధైర్య సాహసాలతో పాటు ఆశీస్సులు కూడా అందించారన్నారు. ‘‘3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి జగన్ ప్రజల కష్టసుఖాలను తెలుసుకున్నారు. అందుకే ప్రజలు ఆశీస్సులు అందించారు. కచ్చితంగా ప్రజలకు మంచి చేసే ముఖ్యమంత్రి మన జగన్’’ అని పేర్కొన్నారు.
జగన్ కు ప్రజాశీస్సులు
Tags:
political news