కర్నూలులో ఆసక్తికర రాజకీయం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కర్నూలులో ఆసక్తికర రాజకీయం

కర్నూలు, మే 1, (way2newstv.com)
ఏపీలో తాజా ఎన్నిక‌ల్లో నువ్వా-నేనా అనే రీతిలో వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ పోరు సాగించిన విష‌యం తెలిసిందే. ఇక‌, క‌ర్నూలు జిల్లా క‌ర్నూలు ఎంపీ స్థానం నుంచి ఈ ద‌ఫా ఓ సంచ‌ల‌న‌మే చోటు చేసుకుంది. నిన్న మొన్న‌టి వ‌రకు కూడా కాంగ్రెస్‌లోనే పుట్టి పెరిగిన కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి ఆయ‌న స‌తీమ‌ణి కూడా అనూహ్యంగా టీడీపీలోకి జంప్ చేశారు. కొన్ని ద‌శాబ్దాలుగా ఉన్న వైరాన్ని కూడా మ‌రిచిపోయి.. టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. క‌ర్నూలు జిల్లాలో కోట్ల వ‌ర్సెస్ కేఈ ఫ్యామిలీ మ‌ధ్య తీవ్ర‌మైన వైరుధ్యం ఉంది. ఏకంగా మూడు ద‌శాబ్దాల పాటు ఈ రెండు ఫ్యామిలీలు రాజకీయంగా తీవ్ర‌మైన బ‌ద్ధ శ‌త్రువులుగా కొన‌సాగుతూ వ‌స్తున్నాయి. అలాంటి వీరిద్ద‌రిని చంద్ర‌బాబు ఎన్నో ప్ర‌య‌త్నాలు చేసి ఎట్ట‌కేల‌కు ఒకే వేదిక మీద‌కు తీసుకువ‌చ్చారు. క‌ర్నూలు ఎంపీ టికెట్‌ను చంద్ర‌బాబు కోట్ల‌కు కేటాయించారు. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి ఓట‌మిపాల‌య్యారు. ఇక్క‌డ నుంచి వైసీపీ నాయ‌కురాలు.. బుట్టా రేణుక విజ‌యం సాధించారు. ఇక‌, ఇప్పుడు అన్ని స‌మీక‌ర‌ణ‌లు మారిపోయాయి. వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన బుట్టాకు చంద్ర‌బాబు టికెట్ నిరాక‌రించ‌డంతో ఆమె తిరిగి వైసీపీలోకి చేరిపోయారు. 


కర్నూలులో ఆసక్తికర రాజకీయం

చాప‌కింద నీరులాగా ఆమె వైసీపీకి విజయం చేకూర్చేలా వ్య‌వ‌హ‌రించారు. ఇక‌, ఇక్క‌డ నుంచి టీడీపీ టికెట్‌పై కోట్ల పోటీ చేశారు. వైసీపీ త‌ర‌ఫున డాక్ట‌ర్ సంజీవ కుమార్ పోటీ చేశారు. ఇక్క‌డ నుంచి జ‌న‌సేన అభ్య‌ర్థిగా ఎవ‌రూ పోటీ చేయ‌క‌పోవ‌డం విశేషం. ఇక‌, కోట్ల ఊరూ వాడా చుట్టి వ‌చ్చారు. ముఖ్యంగా మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి కూడా పాత వివాదాల‌ను ప‌క్క‌న‌పెట్టికోట్ల ప్ర‌చారంలో పాల్గొన‌డం క‌లిసి వ‌చ్చింద‌ని అంటున్నారు.టీడీపీలో టికెట్ ఆశించి భంగ‌ప‌డిన ఎస్వీ సుబ్బారెడ్డి, బుట్టా రేణుక‌లు యూట‌ర్న్ తీసుకుని వైసీపీకి అనుకూలం గా చేసిన ప్ర‌చారాన్నికూడా కొట్టి పారేయ‌లేమ‌ని అంటున్నారు. వాస్త‌వంగా వీరిద్ద‌రికి ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో సొంత ఓటు బ్యాంకు అంటూ లేక‌పోయినా బీసీ వ‌ర్గానికి చెందిన మ‌హిళగా త‌న‌కు అన్యాయం జ‌రిగింది అంటూ బుట్టా సెంటిమెంట్ అస్త్రాన్ని ప్ర‌యోగించారు. ఈ ఇద్ద‌రుకూడా పోటీలో ఉన్న అభ్య‌ర్థికంటే కూడా ఉత్సాహంగా వైసీపీకి ప్ర‌చారం చేశారు. తాము టీడీపీలోకి వ‌చ్చి త‌ప్పు చేశామ‌ని, వైసీపీకి ఓటేసి గెలిపించాల‌ని పిలుపునిచ్చారు. మొత్తంగా వైసీపీ చేసిన ప్ర‌చారం గ‌ట్టిగానే సాగిన నేప‌థ్యంలో కోట్ల గెలుపు సాధ్య‌మేనా అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌.ఇక కోట్ల‌కు సీమ‌లో…ముఖ్యంగా క‌ర్నూలు జిల్లాలో వ్య‌క్తిగ‌త ఓటు బ్యాంకు ఉంద‌న్న‌ది నిజం. గ‌త ఎన్నిక‌ల్లో ఏపీలో కాంగ్రెస్ భూస్థాపితం అయినా క‌ర్నూలు ఎంపీగా పోటీ చేసిన కోట్ల సూర్య‌ప్ర‌కాశ్‌రెడ్డికి ఏకంగా 1.20 ల‌క్ష‌ల‌ ఓట్లు వ‌చ్చాయి. ఇక ఆలూరులో పోటీ చేసిన ఆయ‌న భార్య కోట్ల సుజాత‌మ్మ కూడా 25 వేల ఓట్లు తెచ్చుకున్నారు. వీరిద్ద‌రు ఏపీలో మిగిలిన కాంగ్రెస్ నేత‌ల వ‌లే డిపాజిట్లు కోల్పోకుండా నిల‌బ‌డ్డారు. ఇది వీరి వ్య‌క్తిగ‌త ఓటు బ్యాంక్ అని చెప్ప‌డంలో సందేహాలు అక్క‌ర్లేదు. అయితే, కాంగ్రెస్‌లో ఉన్న‌స‌మ‌యంలో ఉన్న హ‌వా ఇప్పుడు ఆయ‌న‌కు పెరిగిందా? లేదా? ఇక ఇటు వైసీపీ అధినేత జ‌గ‌న్ బీసీ అస్త్రాల్లో ఏది స‌క్సెస్ అయ్యాయో తేలాలంటే మే 23 వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.